గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ యాత్రను ఆపుతారా: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Prajarajyam Party
గుంటూరు: తెలంగాణలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పర్యటనను ఆపుతామనే తెలంగాణవాదుల ప్రకటనను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తప్పు పట్టారు. జగన్ యాత్రను అడ్డుకోవాలనే తెలంగాణవాదుల నిర్ణయం సరైంది కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు తన పాలనలో రైతులను పట్టించుకుని ఉంటే సమస్య ఇంత తీవ్రమయ్యేది కాదని ఆయన అన్నారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తానని చెబుతున్న చంద్రబాబు మాటలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.

నేతన్నలను, రైతన్నల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. రైతు చైతన్య యాత్రలు అవసరం లేదని, రైతుల్లో చాలా చైతన్యం ఉందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పొందేందుకు ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు నేతలు జగడాలు మాని ప్రజా సమస్యలు పట్టించుకోవాలని ఆయన హితవు చెప్పారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన తనకు స్వార్థ రాజకీయాలు తెలియవని ఆయన అన్నారు. పోలవరం డిజైన్ మార్పు, ఖర్చుల కమిటీకి సిఫార్సు వంటి చర్యలు ప్రాజెక్టు నిర్మానంలో జాప్యం చేయడానికేనని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X