కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరింత మంది జగన్ ఎమ్మెల్యేలు కాంగ్రెసులోకి వస్తారు: డిఎల్

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మరింత మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి వస్తారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి, కడప లోకసభ కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ బాటలోనే మరింత జగన్ వర్గం శానససభ్యులు నడుస్తారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ వర్గంలో దళితులకు గౌరవం లేదని, కమలమ్మకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను వైయస్ జగన్ కల్పించలేదని ఆయన అన్నారు.

కమలమ్మ రేపటి నుంచి కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం సాగిస్తారని ఆయన చెప్పారు. కమలమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను హైదరాబాదులో కలిశారని, ఆ తర్వాత కడప జిల్లా కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వచ్చారని ఆయన చెప్పారు. కమలమ్మ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలని కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి చెప్పారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే కడప నుంచి పోటీ చేస్తున్నట్లు రవీంద్రా రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోయినందున మంత్రిగా కొనసాగడం మంచిది కాదని వైయస్ వివేకానంద రెడ్డి భావించి రాజీనామా చేశారని, తాను శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఆయన అన్నారు.

English summary
Minister and Kadapa Congress candidate DL Ravindra Reddy said that more MLAs belonging to YS Jagan will come into Congress. Her said that Kamalamma will campaign for Congress in bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X