కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలో జోక్యం చేసుకోను, కడపలో కాంగ్రెసుదే గెలుపు: పురందేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Daggubati Purandheswari
విజయనగరం: కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని కేంద్రమంత్రి పురందేశ్వరి ఆదివారం విజయనగరం జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ప్రజలు కాంగ్రెసు పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కడప ఓటర్లు మొదటి నుండి కాంగ్రెసు వైపే ఉన్నారని ఇప్పుడు కూడా అలాగే ఉంటారని చెప్పారు.

కాంగ్రెసు పార్టీ నేతలంతా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని గౌరవిస్తున్నారని అన్నారు. వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని చెప్పారు. అది తనకు సంబంధం లేని విషయం అన్నారు. కాంగ్రెసు సంక్షోభాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

కాగా కడపలో ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాంగ్రెసు ఖచ్చితంగా గెలుస్తుందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. జగన్‌ మెజార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. జగన్‌కు రెండు లక్షల మెజార్టీ వస్తుందని తాను చెప్పిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని వారు రెండు లక్షల మెజార్టీ వస్తుందంటే దానిపై తాను సవాల్ చేశానని, కానీ జగన్ గెలుస్తాడని చెప్పలేదన్నారు. మంత్రి డిఎల్ ఖచ్చితంగా గెలుపొందుతారని అన్నారు. జగన్ సొంత జిల్లాలోని వారినే మోసం చేశారన్నారు. భారతిలో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వడం లేదన్నారు.

English summary
Central minister Purandeshwari said today that she will not involve in telugudesam party crisis. She hoped that congress will win in Kadapa by-pole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X