చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్ ఆరోగ్యంపై కంగారు అవసరం లేదు: ఆస్పత్రి వైద్యులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajinikanth
చెన్నై‌: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై కంగారు పడాల్సిన అవసరం లేదని శ్రీరామచంద్ర ఆస్పత్రి వైద్యులు చెప్పారు. జీర్ణకోశ సంబంధమైన, కాలేయ సంబంధమైన సమస్యలతో ఆయన ఈ నెల 13వ తేదీన శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. రజనీకాంత్ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని వైద్యులు చెప్పారు. రజనీకాంత్ నోటీ ద్వారా ఆహారం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. రజనీకాంత్‌తో ఆయన కుటుంబ సభ్యులున్నారని వారన్నారు.

రజనీకాంత్ ఇంకా ఐసియులోనే ఉన్నారని ఆయన చెప్పారు. సాధారణ వార్డుకు మారిస్తే సందర్శకుల తాకిడి పెరిగి ఇన్‌ఫెక్షన్ వస్తుందనే ఉద్దేశంతో రజనీని ఐసియులోనే ఉంచుతున్నామని వారు చెప్పారు. ఐసియులోకి రజనీకాంత్ కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నామని వారన్నారు. రజనీకాంత్ సాధారణ డైట్ తీసుకుంటున్నారని వారు చెప్పారు.

English summary
Sriramachandra hospital doctors announced that Tamil Super star Rajinikanth is recovered from the health problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X