కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును మళ్లీ ఆడిపోసుకున్న వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
కడప: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఓటమిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆడిపోసుకున్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో జగన్ మొదటి నుంచీ చంద్రబాబును నిందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పడిపోదనే అంచనాకు వచ్చిన తర్వాతనే చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారని ఆయన విమర్శించారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం కాక ముందు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఉంటే విద్యార్థులకు, రైతులకు న్యాయం జరిగి ఉండేదని ఆయన అన్నారు. కడప జిల్లా గాలివీడులో తన ఓదార్పు యాత్ర సందర్భంగా సోమవారం మాట్లాడారు. చంద్రబాబుకు రైతులు, పేదలు కనిపించడం లేదని ఆయన విమర్శించారు.

వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లాలని మాత్రమే చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ మరణించిన తర్వాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రైతు సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌ను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.

అనర్హత వేటు పడుతుందని తెలిసి కూడా తనకు మద్దతుగా నిలిచి, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన శాసనసభ్యులకు ఆయన హ్యాట్సాఫ్ చెప్పారు. ఉప ఎన్నికలకు సిద్ధపడి వారు రైతుల కోసం అవిశ్వాసానికి ఓటేశారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాయచోటి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డే పోటీ చేస్తారని ఆయన చెప్పారు. శ్రీకాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

English summary
YSR Congress president YS Jagan has blamed TDP president N Chandrababu Naidu on No - confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X