గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వల్లభనేని వంశీ, జగన్‌ల కలయికను తప్పుపట్టిన చమన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Vallabhaneni Vamsi
గుంటూరు: తెలుగుదేశం పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ స్వర్గీయ టిడిపి నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అనుచరుడు కాదని చమన్ ఆదివారం చెప్పారు. చమన్ పరిటాల రవీంద్ర అనుచరుడు. ఈయన ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. వంశీ పరిటాల అనుచరుడు కాదని, కేవలం అభిమాని మాత్రమేనని చెప్పారు.

వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తనను చాలా బాధించిందన్నారు. తననే కాదు పరిటాల అభిమానులను అందరిని వేధించిందని అన్నారు. రవి హత్యలో ఎవరెవరున్నారు, ఎవరెవరి పాత్ర ఎంత ఉందో కోర్టులో తేలుతుందని ఆయన చెప్పారు.

వల్లభనేని వంశీ తన కుమారుడికి పరిటాల రవి పేరు పెట్టుకొని జగన్‌ను కలవడం సరికాదన్నారు. డిజిపి తన ప్రాణానికి రక్షణ కల్పిస్తానని హామీ ఇవ్వడం వల్లనే తాను లొంగిపోయానని ఆయన చెప్పారు. పరిటాల రవి అనుచరుడు అయిన చమన్ ఆయన హత్య తర్వాత కొంతకాలం అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత లొంగిపోయాడు.

కాగా రెండు రోజుల క్రితం విజయవాడలో వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. వీరి కలయిక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కలిగించింది. తెలుగుదేశం పార్టీ వంశీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై చమన్ గుంటూరులో స్పందించారు.

English summary
Paritala Ravi follower Chaman opposed Vallabhaneni Vamsi meeting with YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy. He said Vamsi is not Paritala Ravi's follower, he is only fan. He said he felt very much with Vamsi attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X