చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ వేట: అళగిరి కుమారుడిపై లుకవుట్ నోటీస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Durai Dayanidhi
చెన్నై: డిఎంకె నేతలపై, ఆ పార్టీ అధినేత కుటుంబ సభ్యులపై అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేట సాగిస్తున్నట్లే కనిపిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై డిఎంకె నేతలపై జయలలిత ప్రభుత్వం విరుచుకుపడుతోంది. తాజాగా అవినీతి ఆరోపణలపై డిఎంకె పార్లమెంటు సభ్యుడు ఎంకె అళగిరి కుమారుడు దురై దయానిధిపై లుకవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

అక్రమ గ్రానైట్ మైనింగ్ కేసులో దురై దయానిధిపై లుకవుట్ నోటీసులు జారీ అయ్యాయి. విచారణ నిమిత్తం దురై దయానిధికి లుకవుట్ నోటీసులు జారీ చేసినట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ఆయనను విచారిస్తామని చెబుతున్నారు.

దురై దయానిధి దేశం విడిచి వెళ్లకుండా చూడాలని పోలీసులు ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. గ్రానైట్ కేసులో 17 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిలో ఒలింపిస్‌పై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్‌ల్లో చేర్చిన పేర్లలో దురై దయానిధి పేరు ఉంది. ఎఫ్ఐఆర్‌లో మొత్తం 60 మంది పేర్లను చేర్చారు.

గ్రానైట్ పరిశ్రమలో ఉల్లంఘనలు జరగడం వల్ల ఖజానాకు 16 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని మధురై మాజీ కలెక్టర్ ఆరోపణలు చేశారు. జిల్లాలోని 175 క్వారీలపై భారీ దాడులు జరిగాయి. ఇదిలావుంటే, అళగిరి కుమారుడు దురై దయానిధి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇది ఈ నెల 4వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.

English summary
The Jayalalitha led government in Tamil Nadu seems determined to expose the corruption within the DMK and had carried out a massive witch hunt on those engaged in graft when the DMK was in power. The latest name to surface in the corruption case is DMK MP Alagiri's son Durai Dayanidhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X