చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రయాంగిల్ లవ్ స్టోర్: ఫైనాన్స్ కంపెనీ యజమాని హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Tamilnadu Map
చెన్నై: ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ఫైనాన్స్ కంపెనీ యజమానిని బలి తీసుకుంది. అవదిలో రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాలో దుండగులు 37 ఏళ్ల ఓ ఫైనాన్స్ కంపెనీ యజమానిని హత్య చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మృతుడు ఎం విజయకుమార్ కన్నగిపురంలోని గాంధీ స్ట్టీట్‌లో నివాసం ఉంటున్నాడని, నెహ్రూ బజార్‌లో ఫైనాన్స్ కంపెనీ నపుడుతున్నాడని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఓ గుంపు అతని కార్యాలయంలోకి ప్రవేశించి, అతనితో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత అతన్ని నరికి చంపారు.

అరక్కోణంలోని పట్టాబిరామ్‌కు చెందిన ఆర్ లింగేష్ కుమార్, అదే ప్రాంతానికి చెందిన అతని మిత్రుడు విజయ్ ఆ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో ఓ నిర్ణయానికి వచ్చారు. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల అమ్మాయితో లింగేష్‌కు లైంగిక సంబంధం ఉన్నట్లు, దాన్ని కాదని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశారని పోలీసు దర్యాప్తులో తేలింది.

విజయ్ కుమార్‌తో సంబంధం పెట్టుకున్నా కూడా ఆ అమ్మాయి లింగేష్‌ను కలుస్తున్నట్లు తేలిందని పోలీసు అధికారులు చెప్పారు. విజయ్ కుమార్‌తో సంబంధాన్ని పసిగట్టిన లింగేష్ కార్యాలయానికి వచ్చాడు. అయితే, లింగేష్ తనను వేధిస్తున్నాడని అమ్మాయి విజయ్ కుమార్‌తో చెప్పింది. దీంతో తన కార్యాలయానికి వచ్చినప్పుడు విజయ్ కుమార్ లింగేష్‌ను నిలదీశాడు.

బుధవారం సాయంత్రం లింగేష్ తన మిత్రులతో వచ్చి విజయ్ కుమార్‌తో గొడవ పడ్డాడు. అది హత్యకు దారి తీసింది. హత్య చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్‌లపై పారిపోయారు. కొద్ది గంటల తర్వాత వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. తగిన సాక్ష్యాధారాలు లభించిన తర్వాత వారిద్దరిని అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

English summary
A 37-year-old man, a finance company owner, was hacked to death over a love triangle at a busy market area in Avadi on Wednesday. Police have detained two men in this connection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X