గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషపు ఇంజక్షన్లతో హత్యాయత్నం: పేలుడు పదార్థాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prakasam Dist
హైదరాబాద్/ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మార్కాపురంలో సమాచార హక్కు చట్టం కార్యకర్త పైన విష ప్రయోగం జరిగింది. శ్రీనివాస రావు అనే స.హ. కార్యకర్త ఆదివారం మార్కాపురంలోని తన కార్యాలయంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతనికి విషపు ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతనిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. శ్రీనివాస రావు గతంలో పలు ప్రభుత్వ కార్యాలయాల నుండి వివిధ సమాచారాలు కోరినట్లుగా తెలుస్తోంది. ఆయనపు విష ప్రయోగం జరగడపం ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, ప్రజాస్వామ్యవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాదులో...

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై సోదాలు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. 1300 జిలెటిన్ స్టిక్స్, 800 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.

బాగ్ అంబరుపేటలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ ఇంటిలో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితమే వారు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో పేలుడు

తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం పేలుడు సంభవించింది. బాణసంచా కేంద్రంలో ఇది జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.

English summary
Right to Information Act activist Srinivas Rao has attacked with poisonous injections by unknown persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X