గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యానికే మద్దతు, విభజిస్తే రాజీనామా: కాసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kasu Krishna Reddy
గుంటూరు: సమైక్యాంధ్రకే తన మద్దతు అని, అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణను ప్రకటిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర సహకార శాఖా మంత్రి కాసు కృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు నుంచి నరసరావుపేట వెళుతూ ఆయన ఆదివారం చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని భావించి ముఖ్యమంత్రి పదవినే తృణప్రాయంగా వదిలివేసిన కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని తానని అన్నారు. ఆ బాటలోనే తాను పయనిస్తానని స్పష్టం చేశారు.

కేంద్రం తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి చేసిన ప్రకటనను సమైక్యాంధ్ర జెఎసి, పరిరక్షణ సమితి స్వాగతించాయి. ఈ మేరకు ఆదివారంరాత్రి గుంటూరులో జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఆచార్య పి నరసింహరావు, పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎండీ హిదాయత్, క్రోసూరి వెంకట్, కనపర్తి శ్రీనివాసరావు, విద్యార్థి జేఏసీ కోకన్వీనర్ మండూరి వెంకటరమణ తదితరులు మీడియాతో మాట్లాడారు. మంత్రి కాసు ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కేంద్రం తెలంగాణ కు అనుకూల నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర అగ్నిగుండం అవుతుందని వారు హెచ్చరించారు. అన్ని పార్టీలు తమ సొంత అజెండాలను పక్కనపెట్టి డిసెంబర్ 9 ప్రకటన అనంతర ఉద్యమ స్ఫూ ర్తిని మళ్లీ ప్రదర్శించాలని వారన్నారు. ర్రాష్టాన్ని విభజిస్తే రాష్ట్రంలో ఏర్పడే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆచార్య నరసింహారావు హెచ్చరించారు.

English summary
The minister Kasu Krishna Reddy said that he will stand for Unified Andhra. If the decision will not for United Andhra, he will resign, He said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X