వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పకడ్బందీ ప్లాన్‌తోనే చోరీ చేశాడు: చిన్న పొరపాటుతో దొరికిపోయాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: పకడ్బందీగా పథకం వేసుకుని దొంగతనం చేసిన ఓ వ్యక్తి చిన్న పొరపాటు చేసి పోలీసులకు దొరికిపోయాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలం సర్ప వరం పోలీస్‌ అతిథిగృహంలో గురువారం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్‌ నిందితుడి వివరాలను వెల్లడించారు.

కాకినాడ బోట్‌క్లబ్‌ ఎదురుగా ఉన్న శ్రీ రామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆఫీస్‌లో నిరుడు నవంబర్‌ 30 రాత్రి భా రీ చోరీ జరిగింది. దొంగ ఆఫీసు కిటికీ గ్రిల్స్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి తొలగించాడు. అనంతరం బ్రాంచ్‌ మేనేజర్‌ గదిలోకి వెళ్లి క్యాష్‌ చెస్ట్‌ (లాకర్‌)లో ఉన్న రూ.17,75, 317, 230.81 గ్రాముల బంగారు వస్తువులు, నాలుగు కంప్యూటర్‌ సిస్టమ్స్‌, ఒక ప్రింటర్‌, రెండు కుర్చీలు దొంగిలించాడు.

మర్నాడు ఉదయాన్నే ఆఫీసుకు వచ్చిన సిబ్బంది దొంగతనం జరిగిందని గుర్తించి సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఛేదించడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఎస్‌హెచ్‌వో బృందం నిందితుడు రాజమండ్రి రూరల్‌ కొంతమూరులో ఉన్నట్టు గుర్తించింది. డిసెంబర్‌ 30 తె ల్లవారుజామున కొంతమూరులో ఇంటిపై దాడి చేసి సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన తూము శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు.

Arrested for robbing Finance company in East Godavari district

దుర్వ్యసనాలకు బానిసైన శ్రీనివాస్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ 2004లో రాజమండ్రిలో మోటార్‌ సైకిల్‌ దొంగతనం చేయగా రాజమం డ్రి త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత బెయిల్‌పై వచ్చి నేరాలు చేస్తూ వెళ్లాడు.

ఆ తర్వాత 2010లో ప్రస్తుతం నేరం చేసిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆఫీసులో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరి కొంత కాలం ఉద్యోగం చేశాడు. ఆ క్రమంలో కంపెనీకి చెందిన రూ.50వేలును వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నాడు. 2013 మార్చిలో అతడిని కంపెనీ నుంచి తీసేశారు. అనంతరం 2014 సెప్టెంబర్‌ 8న విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాకలో ట్రాక్టర్‌ను దొంగిలించగా పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

ఈ నే పథ్యంలో ఏదైనా పెద్దనేరం చేసి సెటిల్‌ అ యిపోదామని నిర్ణయించుకుని తాను పనిచేసి న ఆఫీస్‌ పరిసరాలు, లోపల ప్రదేశాలు బాగా తెలియడంతో అక్కడ దొంగతనం చేసేందుకు ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో నవంబర్‌ 30న శ్రీనివాస్‌ తన జైలో కారులో కొంతమూరు నుంచి కాకినాడకు వచ్చి శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌లో నేరం చేసి చోరీ సొత్తును కారులో వేసుకుని కొంతమూరు పట్టుకుపోయినట్టు ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు.

నిందితుడి నుంచి రూ. 13,65,700, 164.21 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు కంప్యూటర్లు, ఒక ప్రింటర్‌, రెండు చైర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.నేరం చేయడానికి ఉ పయోగించిన మహీంద్రా జైలో కారు, సూపర్‌ గ్యాస్‌ సిలిండర్‌, ఇండస్ర్టియల్‌ గ్యాస్‌ సి లిండర్‌, గ్యాస్‌ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్న ట్టు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ నవంబ ర్‌ 29న శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఆఫీసు కు వచ్చి రెక్కీ నిర్వహించి 30న నేరానికి పాల్పడినట్టు తెలిపారు.

కార్యాలయంలోకి చొరబడిన శ్రీనివాస్ గదిలో చీకటిగా ఉండడంతో ఓ ములన ఉన్న అగ్గిపెట్టె తీసి వెలిగించాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. ఆ గదిలో అగ్గిపెట్టె ఎక్కడ ఉంటుందో సిబ్బందికి మాత్రమే తెలిసి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆఫీసులో పనిచేసి మానేసినవారిపై నిఘా పెట్టారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ చిన్న తప్పిదమే శ్రీనివాస్‌ను పోలీసులకు పట్టించింది.

English summary
Accused in Sriram transport finance company theft case Srinivas has been arrested in East Godavari of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X