వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సైలెన్స్ వెనుక అర్ధం ఏంటి ? రాజకీయ కారణమా ? వ్యూహాత్మక మౌనమా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో తాజా పరిణామాలపై ఇంత రచ్చ జరుగుతోంది. రాష్ట్రానికి కీలకమైన అంశాల గురించి చాలా చర్చ జరుగుతోంది.. ప్రభుత్వం పెద్ద ఎత్తున తప్పిదాలు చేస్తోందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. సహజంగా ఈ స్థాయిలో వ్యవహరం నడిస్తే ఏ ముఖ్యమంత్రైనా స్పందిస్తారు.. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కనీసం స్పందించ లేదు.. చిన్నపాటి పలుకు లేదు. ఇంతకీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌనం వెనుకున్న వ్యూహమేంటీ..? రాజకీయ కారణమేమైనా ఉందా.. ? లేక వ్యూహాత్మక మౌనమా..?

బీజేపీ చేతిలో కొత్త అస్త్రం..౩౦ రోజుల యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీబీజేపీ చేతిలో కొత్త అస్త్రం..౩౦ రోజుల యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ

అమెరికా వెళ్లి వచ్చేలోపు ఎన్నో కీలక పరిణామాలు .. అయినా సైలెంట్ గా ఉన్న సీఎం జగన్

అమెరికా వెళ్లి వచ్చేలోపు ఎన్నో కీలక పరిణామాలు .. అయినా సైలెంట్ గా ఉన్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికా ఫ్లైట్ ఎక్కింది మొదలు.. రాష్ట్రాన్ని పట్టి కుదిపేసిన కీలక అంశాలు చాలానే జరిగాయి.వీటిల్లో ప్రధానమైన రెండు అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతోపాటు.. ప్రభుత్వం కూడా ఇరుకున పడిందా..? అనే స్థాయిలో వ్యవహరమూ నడిచింది.పోలవరం విషయంలో పీపీఏ అభ్యంతరాలు ఓ వైపు.. మరోవైపు కోర్టు స్టే.. ఇక రాజధాని విషయంలో బొత్స వరుస వ్యాఖ్యలు రాజధానిలో ఉద్యమాలకే శ్రీకారం చుట్టేలా చేసిన పరిస్థితి.దీనిపై ఏం జరుగుతోందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలపై స్పందించలేదు.ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

పోలవరంపై కేంద్రంతో చర్చించిన జగన్ .. ఏదైనా ప్లాన్ ప్రకారమే చేస్తారన్న వైసీపీ నేతలు

పోలవరంపై కేంద్రంతో చర్చించిన జగన్ .. ఏదైనా ప్లాన్ ప్రకారమే చేస్తారన్న వైసీపీ నేతలు

జగన్ ఎందుకు స్పందించడం లేదు.. ఇంతటి వ్యవహరం జరుగుతోన్నా.. కనీసం నామ మాత్ర స్పందనైనా లేకపోవడమేంటనే ఆశ్చర్యం అందరిలోనూ వ్యక్తమవుతూనే ఉంది.ప్రతిపక్షంలో ఉన్నప్పడంటే సరిపోయింది.. కానీ అధికారంలోకి వచ్చాక కూడా అదే విధానాన్ని.. అదే తరహాలో వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తే ఎలా..? అనే చర్చ జరుగుతోంది.ఈ చర్చ అంతా ఓవైపు జరుగుతోంటే.. ముఖ్యమంత్రి సన్నిహితుల వాదన వేరే విధంగా ఉంది.కీలకమైన అంశాల గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారని.. దీనిపై పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నారనే విషయాన్ని చెబుతున్నారు.చెప్పడం కాకుండా.. చేసి చూడపడమనేది మొదట్నుంచి జగన్ వైఖరి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.అమెరికా పర్యటన నుంచి రాగానే పోలవరం విషయంలో పీపీఏ పెట్టిన అభ్యంతరాల గురించి.. కోర్టు ఇచ్చిన స్టే గురించి సమీక్ష నిర్వహించారని.. అక్కడితో ఆగకుండా.. ఢిల్లీకి వెళ్లి సంబంధిత కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

జగన్ మీడియా ముందుకు పదేపదే వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అంటున్న జగన్ సన్నిహితులు

జగన్ మీడియా ముందుకు పదేపదే వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అంటున్న జగన్ సన్నిహితులు

అలాగే రాజధాని విషయంలో ఎవరు ఏయే కామెంట్లు చేస్తున్నారు.. ప్రభుత్వ వాదన సరిగా వెళ్తోందా..? లేదా అనే అంశాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారని అంటున్నారు.ప్రతిపక్షాలు ఏవో కామెంట్లు చేసేసి.. ఏదేదో ఊహించేసుకుని చేస్తోన్న రాద్ధాంతానికి సీఎం జగన్ స్పందించాల్సిన అవసరమేం ఉందంటున్నారు.పైగా ప్రభుత్వ వాదనను మంత్రులు.. పార్టీ నేతలు సమర్ధంగా వినిపిస్తున్నారని అంటున్నారు.ఇవన్ని ఒక ఎత్తు అయితే.. జగన్ మోహన్ రెడ్డికి ఏదైనా అంశానికి సంబంధించి కానీ.. అటు రాజకీయంగా కానీ.. పరిపాలన పరంగా కానీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి పదే పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువేననే విషయాలను గుర్తు చేస్తున్నారు.జగన్ ఏం చెప్పాలన్నా.. ఏం చేయాలన్నా.. ప్రజల మధ్యనే ప్రకటించడం.. ప్రజలకే నేరుగా చెప్పుకోవడం.. ప్రతిపక్షాలకు కానీ.. ప్రత్యర్థి పార్టీలకు కానీ ప్రజా వేదికల మీదే గట్టిగా రిటార్ట్ ఇవ్వడం అనేది జగన్ కు పుట్టుకతో వచ్చిన లక్షణమని అంటున్నారు.

 ప్రజలకే నేరుగా చెప్పాల్సిన సమయంలో చెప్తారంటున్న నేతలు ..

ప్రజలకే నేరుగా చెప్పాల్సిన సమయంలో చెప్తారంటున్న నేతలు ..

పార్టీ ఆవిర్భావం నాటి నుంచి సీఎం అయ్యే వరకు.. సుదీర్ఘ పాదయాత్ర చేసిన సందర్భంలోనూ మీడియాతో మాట్లాడ్డం.. ఫలానా అంశాలపై ప్రత్యేకంగా స్పందించడం వంటి సంఘటనలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చంటున్నారు.ప్రభుత్వం.. పార్టీ విధానాలకు సంబంధించి ఏమైనా చెప్పదలుచుకుంటే నేరుగా ప్రజలకే చెబుతారని.. లేకుంటే అసెంబ్లీ వంటి వేదికలపై చెబుతారని అంటున్నారు.
ఇప్పుడు కూడా రాజధాని విషయంలో కానీ.. పోలవరం విషయంలో కానీ చెప్పాల్సిన వేదికల మీద.. చెప్పాల్సిన సమయంలో చెబుతారని.. అంటున్నారు.

English summary
The latest developments in the AP are going on. There is a lot of debate on the key issues of the state .. The government is making big mistakes and the opposition is targeting the ruling party. CM Jagan Mohan Reddy's silent is a tactic ? .. Is there any political reason ..? Or strategic silence? There is debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X