కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కాస్త తగ్గిన కరోనా కొత్త కేసులు.. తాజాగా 1413 కేసులు, 18 మరణాలు.. ఆ జిల్లాలో భారీగా !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. ఏపీలో నిన్న నమోదైన మొత్తం కేసులతో పోలిస్తే, గత 24 గంటలలో నమోదైన కేసులు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. నిన్న ఏపీలో 2050 కరోనా కేసులు 18 మరణాలు నమోదు కాగా, ఈరోజు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1413 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గత 24 గంటల్లో 54,475 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది 1413 మందికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 19, 83,721 కి చేరింది.

రాష్ట్రంలో 19,549 క్రియాశీల కేసులు
తాజాగా కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 18 మంది మృత్యువాత పడ్డారు. నిన్న కూడా 18 మంది మరణించడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,549కి పెరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,549 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇదే సమయంలో గత 24 గంటల్లో 1,795 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నట్లుగా సమాచారం. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 19,50,623 గా నమోదయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,52,47,884 నమూనాలను పరీక్షించినట్లు గా అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

Corona new cases slightly reduced in AP .. latest 1413 cases, 18 deaths

తూర్పు గోదావరి జిల్లాలో భారీగా కరోనా కేసులు , అత్యల్పంగా కర్నూలులో
కరోనా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం ,శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయినట్టు గా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 458 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 201 ,గుంటూరు జిల్లాలో 95 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 75 కేసులు, కృష్ణా జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 207 కేసులు, ప్రకాశం జిల్లాలో 94 కేసులు నమోదయ్యాయి.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కట్టడికి సర్కార్ యత్నం
శ్రీకాకుళం జిల్లాలో 52 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 45 కేసులు, విజయనగరంలో 16 కేసులు, వెస్ట్ గోదావరిలో 32 కేసులు నమోదైనట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించింది . తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు ఉన్న పరిస్థితి ఏపీ సర్కార్ కు ఆందోళనకరంగా మారింది. కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది.ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సైతం కొనసాగుతుంది.

స్కూల్స్ ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్
ఆగస్టు 16వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిన జగన్ సర్కార్, వ్యాక్సినేషన్ ను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళన దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కరోనా ప్రోటోకాల్స్ ను పటిష్ఠంగా అమలు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న టాప్ ఫైవ్ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూ కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

English summary
In the last 24 hours, 1413 people in the state of Andhra Pradesh have been diagnosed with corona positive, according to official figures. Medical personnel who conducted 54,475 corona diagnostic tests in the last 24 hours identified 1413 people with corona infection. Meanwhile, the total number of registered cases across the state so far has reached 19,83,721. 18 people have died in the last 24 hours. The highest number of 458 cases was reported in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X