వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీయం..సీయ‌స్ మ‌ధ్య పెరుగుతున్న గ్యాప్...! : ఇద్ద‌రూ స‌చివాల‌యంలోనే : స‌మీక్ష‌ల‌కు గైర్హాజ‌రు..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌లు ముఖ్య‌మంత్రి..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ధ్య గ్యాప్ సృష్టించింది. ముఖ్య‌మంత్రి గ‌తంలో నియ‌మించిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కాద‌ని ఎన్నిక‌ల సంఘం మ‌రో అధికారిని ప్ర‌భుత్వ ప్ర‌ధాక కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. అయితే, ఈ నిర్ణ‌యం పైన చంద్ర‌బాబు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆయ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. అయితే, ఇద్ద‌రూ సచివాల‌యంలోనే ఉన్నా సీయంను సీయ‌స్ క‌ల‌వ‌క‌పోవ‌టం చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది...

ఎల్వీని సీయ‌స్ చేసిన ఇసి..

ఎల్వీని సీయ‌స్ చేసిన ఇసి..

ఎన్నిక‌ల వేళ ఏపిలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌ధాక కార్య‌ద‌ర్శి పునీతాను ఎన్నిక‌ల సంఘం త‌ప్పించింది. ఏపి లో ప‌రిణామాల పైనా ఎన్నిక‌ల సంఘం ఢిల్లీలోని త‌మ ప్రధాన కార్యాల‌యానికి పిలిపించి వివ‌ర‌ణ కోరింది. అయిన‌ప్ప‌టికీ..సీయ‌స్‌గా ఉన్న పుతీన‌ను త‌ప్పిస్తూ..ఆయ‌న స్థానంలో ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ పునీతాను విధుల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌కు భిన్నంగా ఏపి ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వ‌ర‌రావు విష‌యంలో తొలుత రిలీవ్ ఉత్త‌ర్వులు ఇవ్వ‌టం..ఆ త‌రువాత ర‌ద్దు చేయ‌టం పైన ఇసి సీరియ‌స్ అయింది. ఇదే అంశం పైన కోర్టుకు వెళ్లటం గురించి ఇసి వివ‌ర‌ణ తీసుకున్న‌ట్లు స‌మాచారం. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకొని పునీత‌ను త‌ప్పించి ఆయ‌న స్థానంలో ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను నియ‌మించింది.

ఎల్వీ నియామ‌కం పైన బాబు సీరియ‌స్..

ఎల్వీ నియామ‌కం పైన బాబు సీరియ‌స్..

త‌మతో ఎటువంటి సంప్ర‌దింపులు లేకుండా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న పునీత‌ను త‌ప్పించి ఆయ‌న స్థానంలో ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం నియామ‌కం పైన చంద్ర‌బాబు ఓపెన్ గానే త‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని నియమించే స‌మ‌యంలో ఎటువంటి అంశాలు ప్ర‌తిపాదిక‌గా తీసుకున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, కోర్టులో కేసులు ఉన్న వ్య‌క్తి..జ‌గ‌న్ కేసుల్లో స‌హ నిందితుడిగా ఉన్న ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను సీయ‌స్‌గా ఎలా నియ‌మిస్తార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఒక ద‌శ‌లో ఎల్వీని కోవ‌ర్టుగా చంద్ర‌బాబు అభివ‌ర్ణించార‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది. ఈ వ్యాఖ్య‌ల పైన ఆయ‌న మ‌న‌స్థాపానికి గుర‌య్యారు. అదే స‌మ‌యంలో రిటైర్డ్ ఐఏయ‌స్ అధికారులు సైతం గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ఫిర్యాదు చేసారు. చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేసారు.

 సీయం తో సీయం దూరం..

సీయం తో సీయం దూరం..

ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం సీయం తో దూరం పాటిస్తున్న‌ట్లు స‌చివాల‌యంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌టంతో ముఖ్య‌మంత్రి నిర్వ‌హిస్తున్న స‌మీక్ష‌ల‌కు ఆయ‌న దూరంగా ఉంటున్నార‌ని చెబుతున్నారు. అయితే, గురువ‌వారం ముఖ్య‌మంత్రి స‌చివాల‌యానికి వ‌చ్చారు. ఆర్దిక సంఘం స‌భ్యులు స‌చివాల‌యానికి వ‌చ్చి సీయ‌స్‌తో స‌మావేశ‌మ‌య్యారు. మ‌రో వైపు సీయం సీఆర్‌డిఏ స‌మీక్ష నిర్వ‌హించారు. సాధార‌ణంగా గ‌తంలో అయితే సీఆర్‌డిఏ స‌మీక్ష‌కు సీయ‌స్ హాజ‌ర‌య్యే వారు కాదు. అయితే, ఇప్పుడు కోడ్ ఉన్న స‌మ‌యంలో అస‌లు స‌మీక్ష‌లే నిర్వ‌హించ‌కూడ‌దనే నిబంధ‌న అమ‌ల్లో ఉండ‌గా..సీయ‌స్ ఎలా హాజ‌ర‌వుతార‌ని మ‌రి కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, సీయం వ్యాఖ్య‌ల ప్ర‌భావంతోనే సీయ‌స్ దూరంగా ఉంటున్నారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
Gap between AP Cheif Minister and Chief secretary. Babu serious on election commission decision on nominating LV Subramanyam as new CS for AP. Now, Both are maintaining distance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X