వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు: ఛాలెంజ్ విసురుకుంటున్న టీడీపీనేతలు; రచ్చ మాములుగా లేదుగా!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడేళ్ల పాలన పై, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. తాజాగా జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు అంటూ ప్రతి టిడిపి నేత మూడు వైఫల్యాలను తెలియజేయాలని చేస్తున్న ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏపీ ప్రజలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.

అయ్యన్న చెప్పిన జగన్ మూడు మోసపు వాగ్దానాలు

అయ్యన్న చెప్పిన జగన్ మూడు మోసపు వాగ్దానాలు

టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన 3 మోసపు వాగ్దానాలను గురించి చెబుతూ బీసీలకు ఏడాదికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తాం అని, పోలవరాన్ని 2020 కి పూర్తిచేస్తాం అని, 2.36 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను అని జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు చేశారని ఇలాగే 3 వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సింది గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని , ఎన్ అమర్నాథ్ రెడ్డి గార్లను నామినేట్ చేస్తున్నానని వెల్లడించారు.

అయ్యన్న ఛాలెంజ్ స్వీకరించి గోరంట్ల చెప్పిన జగన్ మోసాలు

అయ్యన్న ఛాలెంజ్ స్వీకరించి గోరంట్ల చెప్పిన జగన్ మోసాలు


ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయ్యన్నపాత్రుడు చేసిన ఛాలెంజ్ ను స్వీకరించి జగన్మోహన్ రెడ్డి మరొక మూడు మోసపు వాగ్దానాలను వెల్లడించారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి ఇస్తానని, వృద్ధాప్య పెన్షన్ 3000 రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలు చేశారని, మరో మూడు వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రులు దేవినేని ఉమ ను, చినరాజప్ప ను నామినేట్ చేశారు.

జగన్ వైఫల్యాలపై దేవినేని ఉమా, ఎన్ అమర్నాథ్ రెడ్డి చెప్పిందిదే

జగన్ వైఫల్యాలపై దేవినేని ఉమా, ఎన్ అమర్నాథ్ రెడ్డి చెప్పిందిదే


ఇక దేవినేని ఉమా పోలవరం ప్రాజెక్టు ను అటకెక్కించారు అని, నిర్వాసితులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి నేడు ధ్వంసం చేశారని, మరో మూడు వైఫల్యాలను చెప్పి మాజీ మంత్రి జవహర్ కు, దూళిపాళ్ల నరేంద్రను వారు కూడా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాలని నామినేట్ చేశారు. పెట్రోల్,డీజిల్ ఛార్జీలు పెంచమని చెప్పారని, కరెంటు చార్జీలు తగ్గిస్తామని, కులం చూసి కాదు ప్రతిభను చూసి పదవులు ఇస్తామని చెప్పారని జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు చేశారంటూ ఎన్ అమర్నాథ్ రెడ్డి మరో మూడు వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిందిగా కాల్వ శ్రీనివాసులు,వంగలపూడి అనిత లను నామినేట్ చేశారు.

జగన్ మోసపు వాగ్దానాలను ఏకరువు పెట్టిన కాల్వ శ్రీనివాసులు, వంగలపూడి అనిత

జగన్ మోసపు వాగ్దానాలను ఏకరువు పెట్టిన కాల్వ శ్రీనివాసులు, వంగలపూడి అనిత


కాల్వ శ్రీనివాసులు జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తానని మోసం చేశారని, 3 వేల కోట్లతో ధరల స్థీరీకరణనిధి ఏర్పాటు చేస్తానన్నారని,హంద్రీనీవా నుంచి దద్దరాల చెరువుకు నీరు తీసుకువస్తామని చెప్పారని ఇవి జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు.ఇలాగే 3 వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిందిగా బీటెక్ రవిని, పత్తిపాటి పుల్లారావును నామినేట్ చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక వంగలపూడి అనిత మహిళలకు భద్రత లేదని, దిశ చట్టం లో 21 రోజుల్లో ఉరి వేస్తామని అమలు చేయడం లేదని, మహిళలపై నేరాల అదుపు లేదని, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు చేశారని పేర్కొంటూ పంచుమర్తి అనురాధను, భూమా అఖిలప్రియ ను నామినేట్ చేశారు.

విరుచుకుపడిన పంచుమర్తి అనురాధ.. జగన్ కు బైబై చెప్పటానికి ఇంకా రెండేళ్ళు అంటూ హ్యాష్ ట్యాగ్

విరుచుకుపడిన పంచుమర్తి అనురాధ.. జగన్ కు బైబై చెప్పటానికి ఇంకా రెండేళ్ళు అంటూ హ్యాష్ ట్యాగ్

పంచుమర్తి అనురాధ జగన్ మోసపు వాగ్దానాలను చెబుతూ కులం చూడం, మతం చూడం అని చెప్పారని, చేనేత కార్మికులను ఆదుకుంటామని, టెక్స్టైల్ పార్కులు, సంక్షేమ పథకాలు, ఈ స్టోర్ లు అందిస్తామని మోసపు వాగ్దానాలు చేశారని పేర్కొంటూ చింతమనేని ప్రభాకర్ ను, రాజోలు ఎమ్మెల్యేను నామినేట్ చేశారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు ఇచ్చిన వాగ్దానాలను, వచ్చిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు అంతేకాదు జగన్ కు బై బై చెప్పడానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉందని #2YearsToByeByeJagan హ్యాష్ టాగ్ ను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

English summary
TDP leaders are nominating another two tdp leaders to say about three false promises said by Jagan Reddy . The hashtag # 2YearsToByeByeJagan is going viral on a large scale on social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X