నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో క్యూ.. చంద్రబాబు ఝలక్, కావాలనే హైద్రాబాద్‌లో లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నాడు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నాడు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఎమ్మెల్సీగా ప్రతిపాదించినంతుకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా సేవ చేసేందుకు ఇది తనకు ఓ అవకాశమని పేర్కొన్నారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా టిక్కెట్‌ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రస్తావన వచ్చింది.

<strong>వైయస్ చనిపోయినా: జగన్ మీద మాజీ సీఎస్ రమాకాంత్ షాకింగ్ వ్యాఖ్యలపై టిడిపి</strong>వైయస్ చనిపోయినా: జగన్ మీద మాజీ సీఎస్ రమాకాంత్ షాకింగ్ వ్యాఖ్యలపై టిడిపి

అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని కసరత్తు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలో ముఖ్యమంత్రికి స్పష్టత ఉన్నందున దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని, ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రికే వదిలేద్దామని ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు.

N Chandrababu's son Nara Lokesh likely to contest MLC election

పొలిట్‌బ్యూరో ఈ మేరకు తీర్మానించింది. లోకేష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అంశంపై తీర్మానిద్దామని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ప్రతిపాదించగా అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించడం లేదని, లోకేష్‌ గురించి ప్రత్యేకంగా తీర్మానించడం బాగుండదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లుగా వార్తలు వచ్చాయి.

<strong>ఎమ్మెల్సీగా లోకేష్, కేబినెట్లోకి రంగం సిద్ధం: హరికృష్ణ ఓకే చెప్పారా?</strong>ఎమ్మెల్సీగా లోకేష్, కేబినెట్లోకి రంగం సిద్ధం: హరికృష్ణ ఓకే చెప్పారా?

సమావేశం అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లోకేష్‌కు శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్నవారు పదుల సంఖ్యలో శనివారం నుంచి విజయవాడలో మకాం వేశారు. మరోసారి చంద్రబాబును కలసి విన్నవించాలని ప్రయత్నిస్తున్నారు. కావాలనే ముఖ్యమంత్రి ఎవరినీ కలవడం లేదు. విజయవాడలో ఉంటే టిక్కెట్ల ఆశావహులంతా వచ్చి కలిసేందుకు ప్రయత్నిస్తారన్న ఉద్దేశంతో లోకేష్‌ కూడా హైదరాబాద్‌లో ఉండిపోయారని తెలుస్తోంది.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu's son Nara Lokesh is expected to be made a member of the state Legislative Council, in a prelude to his possible induction into the AP Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X