నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డుపై గొడవలేంటి?: ఆనం సోదరులకు లోకేష్ క్లాస్, అసలేం జరిగింది?

‘కలిసి పని చేయకపోతే కష్టం. జిల్లాలో మీది రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. సమస్య ఉంటే పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకురండి.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై క్షేత్రస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా టీడీపీలో నెలకొన్న పరిస్థితులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కలిసి పని చేయకపోతే కష్టం. జిల్లాలో మీది రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. సమస్య ఉంటే పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకురండి. రోడ్డుపై గొడవలు పడటం ఏంటి?' అంటూ లోకేష్ తోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ 'ఆనం' సోదరులకు క్లాస్‌ పీకినట్లు సమాచారం.

ఇటీవల కార్పొరేటర్‌ రంగమయూర్‌రెడ్డి వ్యవహారం, సమన్వయ కమిటీలో ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు తదితర అంశాలపై జిల్లా పరిశీలకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధిష్ఠానానికి నివేదికలు అందించారు. వీటిపై వివరణ ఇచ్చే విధంగా ఆనం సోదరులు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.

ఆనం సోదరుల వ్యవహారంపై చర్చ

ఆనం సోదరుల వ్యవహారంపై చర్చ

సోమవారం ఉదయం మొదట మంత్రి నారాయణతో సమావేశమై కొద్దిసేపు చర్చించారు. అనంతరం సోమవారం రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆనం సోదరులు వెళ్లారు. అక్కడ లోకేష్‌, కళా వెంకట్రావ్‌, మంత్రి నారాయణ కలిసి ఆనం సోదరులతో చర్చించి నట్లు సమాచారం. ఈ సందర్భంగా లోకేష్‌, కళా వెంక ట్రావ్‌లు ఇటీవల జిల్లాలో జరిగిన సంఘటనలు, ఆనం సోదరుల వ్యహారంపై చర్చించినట్లు తెలిసింది.

గరంగరంగానే..

గరంగరంగానే..

‘అందరూ కలిసి పని చేయాల్సిందే. సమన్వయంతో ముందుకు సాగాలి. రోడ్లపైకి వెళ్లి వివాదాలు పడడం మంచిది కాదు. ఏదైనా ఉంటే పార్టీ హై కమాండ్‌ దృష్టికి తీసుకురావాలే తప్ప వ్యక్తిగత నిర్ణయాలకు తావు లేదు' అని కళా వెంకట్రావ్‌ గట్టిగానే మాట్లాడినట్లు సమాచారం. ఇదే అంశాలపై లోకేష్‌ కూడా ఆనం సోదరులతో మాట్లాడినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేటర్‌ రంగమయూర్‌రెడ్డి వ్యవహారం గరం గరంగా సాగింది.

బుచ్చయ్య ఆగ్రహం

బుచ్చయ్య ఆగ్రహం

ఇటీవల కార్పొరేషనలో రోజుకో వివాదాలు చోటు చేసుకోవడం, దీని వెనుక ఆనం సోదరులు ఉన్నారని అధిష్ఠానానికి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. అయితే, టీడీపీ అధిష్టానం దీనిపై అంతగా దృష్టి పెట్టలేదు. ఫిబ్రవరి 6న నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎవరా పాల్‌.. అంటూ రంగమయూరిరెడ్డి.. కార్పొరేషన్ ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఆ సంఘటనలను చిత్రీకరించి వివరాలన్నీ బుచ్చయ్యచౌదరికి అందించారు. దీంతో బుచ్చయ్యచౌదరి అక్కడే ఉన్న జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి ఏమిటి ఇదంటూ గట్టిగా ప్రశ్నిం చారు. దీనిపై పూర్తి నివేదికలు అధిష్ఠానానికి అందిస్తానని ఆయన వెల్లడించారు.

ఆనం వ్యాఖ్యల కలకలం

ఆనం వ్యాఖ్యల కలకలం

అదే రోజు జరిగిన సమ న్వయ కమిటీ సమావేశంలో ఆనం రామనారాయణరెడ్డి.. పట్టభద్రుల ఎంపికపై ఎవరిని అడిగి అభ్యర్థిని ఖరారు చేశారంటూ వ్యాఖ్యానించడంపై కూడా బుచ్చయ్య చౌదరి కొంత ఇబ్బందికి గురయ్యారు. ఆత్మకూరు నియోజక వర్గంలో ప్రొటోకాల్‌ వివాదం ఒకటి పార్టీకి సమస్యగా మారింది. ఆనం సోదరుల చేరికను కొందరు వ్యతిరేకిస్తున్న వారు రంగమయూర్‌ వ్యవహారంపై బుచ్చయ్యచౌదరికి ఫిర్యాదు చేశారు.

పునరావృతం కానివ్వం..

పునరావృతం కానివ్వం..

ఈ క్రమంలో టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో రంగ మయూర్‌రెడ్డి వ్యవహరించిన తీరును పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. అరగంటపాటు లోకేష్‌, కళా వెంకట్రావ్‌లతో చర్చించిన ఆనం సోదరులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. ఏమైనా ఉంటే పార్టీ అధిష్టానాన్ని సంప్రదిస్తామని చెప్పినట్లు తెలిసింది. సీనియర్ నేతలుగా కొనసాగుతున్న ఆనం సోదరులు ఏడాది క్రితమే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

English summary
Telugudesam Party general secretary Nara lokesh on Monday fired at senior leaders Anam Rama Narayana Reddy, Anam Vivekananda Reddy for political clashes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X