బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ఐటీ పార్కులో ఎన్టీఆర్ విగ్రహం, తయారు చేసింది మనోళ్లే

కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జెపి పార్కులో పలువురు ప్రముఖుల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. అందులో తెలుగుజాతి ఆణిముత్యం స్వర్గీయ నందమూరి తారక రామారావుది కూడా ఉంది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జెపి పార్కులో పలువురు ప్రముఖుల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. అందులో తెలుగుజాతి ఆణిముత్యం స్వర్గీయ నందమూరి తారక రామారావుది కూడా ఉంది.

కాగా, జెపి పార్కులో ప్రతిష్ఠించనున్న విగ్రహాల తయారీకి తెనాలి వేదికైంది. విగ్రహాల తయారీలో తెనాలికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న కర్నాటక ఎమ్మెల్యే మునిరత్నం తెనాలికి చెందిన శిల్పి కాటూరి రవిచంద్రను సంప్రదించారు.

NTR's statue in Bengaluru IT park

దేశానికి చెందిన 34 మంది ప్రముఖుల విగ్రహాలను తయారు చేయించేందుకు ప్రణాళిక చేశారు. ఈమేరకు కాటూరి రవిచంద్ర తన తండ్రి వెంకటేశ్వరరావుతో కలిసి రూపొందించారు. మూడు నెలల కాలంలో ఫైబర్‌ విగ్రహాలను తీర్చిదిద్దారు.

ఇందులో చత్రపతి శివాజీ, టిప్పు సుల్తాన్‌, ఝాన్సీరాణి, బాబూరాజేంద్ర ప్రసాద్‌,ఎన్టీఆర్, వహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, భగత్ సింగ్‌, మడకరి నాయక, సంగోలి రాయన్న, జయచామరాజ వడయార్‌, ఇందిరాగాంధీ, పింగళి వెంకయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎంజి రామచంద్రన్‌, రాజకుమార్‌, ప్రేమ్‌ నజీర్‌, కె.సి.రెడ్డి, వినాయక కృష్ణ గోకక్‌, హనుమంతయ్య, చంద్రశేఖర్‌ కుమార్‌, మస్తి వెంకటేష్‌ అయ్యంగార్‌ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. శనివారం వీటిని బెంగళూరుకు తరలించారు.

English summary
Late Nandamuri Taraka Rama Rao statue will be in Bengaluru JP IT park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X