గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు: శిక్షించాలని టిడిపి ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

NTR statue destoyed
గుంటూరు: గుంటూరు జిల్లాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. జిల్లాలోని చెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని దక్షిణ మండల డిఎస్పీ పరిశీలించారు.

పెట్రోలు పోసి నిప్పంటించినట్లు గుర్తించారు. తమ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నిప్పు అంటించిన దుండగులను వెంటనే గుర్తించి శిక్షించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించారు.

కాగా, రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నల్గొండ, ఖమ్మం జిల్లా పర్యటనను నిరసిసిస్తూ తెలంగాణవాదులు వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

నల్గొండ జిల్లాల్లో పలు చోట్ల గురువారం, రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారు పైన గల వైయస్ విగ్రహాన్ని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

English summary

 Uknown persons set fire to late Nandamuri Taraka Rama Rao statue in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X