వైఎస్ వివేకా హత్య .. వైఎస్ ఇంటి మార్క్ మర్డర్ , జగన్నాటకం అంటూ టీడీపీ నేతలు ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్ వివేకా హత్య కేసు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి న్యాయం కోసం ఇంకెంత కాలం ఎదురు చూడాలని ప్రశ్నించడంతో, తన తండ్రి హత్య కేసు విచారణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో జగన్ ని టార్గెట్ చేసిన ప్రతిపక్ష టీడీపీ హూ కిల్డ్ బాబాయ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా ఈ వ్యవహారం మరింత చిలికి చిలికి గాలివానగా మారింది .

బాబాయ్ హత్యతో అబ్బాయ్ కి సంబంధం ఉంది : టీడీపీ నేతల ధ్వజం
ఇక ఏకంగా నారా లోకేష్ సత్య ప్రమాణానికి సిద్ధమై, తన కుటుంబానికి సంబంధం లేదని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తానని, జగన్ కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. నేడు అలిపిరి వద్ద లోకేష్ ప్రమాణం చేయగా, లోకేష్ సవాల్ ను స్వీకరించని జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయడానికి రాలేదు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు జగన్ ను మరోమారు టార్గెట్ చేస్తున్నారు . బాబాయ్ హత్యతో అబ్బాయ్ కి సంబంధం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు .

తాడేపల్లి కొంపలో పిల్లిలా నక్కి దాక్కున్నావేం జగన్ రెడ్డి : అచ్చెన్న సెటైర్లు
ఇప్పటికే నారా లోకేష్ వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీ వీడింది అని బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అని సంచలన వ్యాఖ్యలు చేస్తే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ వివేకా హత్య తో తనకు గానీ తన కుటుంబానికి గానీ సంబంధం లేదని నారా లోకేష్ తిరుపతిలో ప్రమాణం చేశాడు. మరి బాబాయి హత్యతో మీకు గానీ , మీ కుటుంబ సభ్యులకు గానీ సంబంధం లేదని ప్రమాణం చేయకుండా తాడేపల్లి కొంపలో పిల్లిలా నక్కి దాక్కున్నావేం జగన్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు.

లోకేష్ సవాల్ విసిరితే పారిపోయావు, హత్య మీ పనేనని ఒప్పుకున్నావు :అచ్చెన్న
తండ్రి శవం పక్కన ఉంటే సంతకాలు సేకరించిన వాడివి, బాబాయ్ శవం బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉంటే ఓట్లు దండుకోవడానికి చూసినవాడివి అంటూ ఎవరు వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు ఇక లోకేష్ సవాల్ విసిరితే పారిపోయావు, హత్య మీ పనేనని ఒప్పుకున్నావు అంటూ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. లోకేష్ సవాల్ కి జగన్ ఎందుకు తోక ముడిచారు ? బాబాయి మరణం పై జగన్ ఎందుకు మాట్లాడలేదు అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.

ఈ జగన్నాటకం ఎవరిని కాపాడటం కోసం : దేవినేని ఉమా
సొంత పత్రిక చానల్లో గుండెపోటు అనే ప్రచారం చేశారని, తర్వాత హత్య జరిగింది, ఆధారాలు చెరిపేశారు అంటున్నారని చెప్పారు . బాబాయ్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని జగన్ ను నిలదీశారు . ఈ జగన్నాటకం ఎవరిని కాపాడటం కోసం అంటూ ప్రశ్నించారు దేవినేని ఉమా. వివేకా హత్య పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడం ,అలిపిరిలో తిరుమల శ్రీవారి పాదాల సాక్షిగా నారా లోకేష్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేసినప్పటికీ, జగన్ ప్రమాణం చేయకపోవడంపై టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇది వైయస్ ఇంటి మార్క్ మర్డర్ : అయ్యన్న పాత్రుడు
ఇది వైయస్ ఇంటి మార్క్ మర్డర్ అని అందరికీ అర్థమైందని , ఇక తెలియాల్సింది సిబిఐ అధికారులకు మాత్రమేనని పేర్కొన్నారు. 14న తిరుపతి వచ్చి ఉంటే బాబాయ్ హత్య మిస్టరీ తేలిపోయేది . అందుకే వైయస్ జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలనుకుంటే పరారయ్యారని విమర్శించారు . లోకేష్ సవాల్ విసిరితే పారిపోయిన వైయస్ జగన్ ఇప్పటికైనా మించి పోయింది లేదని బాబాయ్ హత్య కేసు విచారణలో సిబిఐ కి సహకరించు, బాబాయి ఆత్మ శాంతిస్తుంది అంటూ సూచించారు . ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబాయ్ ని ఎవరు చంపారో తెలుసుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు ఇది వైయస్ ఇంటి మార్క్ మర్డర్ అన్నారు.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications