• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మొన్న హరీష్ .. ఇప్పుడు రేవంత్ .. ఏపీ పరిస్థితి చెప్పారుగా.. వీడియోలు పోస్ట్ చేసి లోకేష్ అసహనం

|

ఏపీ సీఎం మూడు రాజధానుల ప్రకటన నేపధ్యంలో ఏపీలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని ఆందోళనలు కొనసాగిస్తున్నారు రాజధాని గ్రామాల రైతులు . ఇక ఈ నేపధ్యంలో ఏపీలో ఒక అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా ధర్నాలు, ర్యాలీలు. అరెస్ట్ లు , హౌస్ అరెస్ట్ లతో ఏపీలో పరిస్థితి అధ్వానంగా తయారైంది.

మీ నిర్ణయం మంచిదా? అయితే ఏపీలో ఎందుకీ యుద్ధ వాతావరణం.. లోకేష్ సీరియస్

తెలంగాణా రాష్ట్రంలోనూ ఏపీలోని పరిస్థితులపై చర్చ

తెలంగాణా రాష్ట్రంలోనూ ఏపీలోని పరిస్థితులపై చర్చ

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు చూసి తెలంగాణా రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతుంది. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఒక్క అధికార పార్టీ నేతలకు సరైనదని అనిపించినా ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ నిర్ణయం తప్పని ఆందోళనల బాట పట్టాయి. మూడు రాజధానులతో ప్రగతి సాధ్యం కాదని ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రాక్టికల్ గా చాలా సమస్యలు ఉంటాయని ఈ ప్రయోగం సత్పలితాలను ఇవ్వదని వారు చెప్తున్న పరిస్థితి . ఇక ఏపీలో టాక్ అలా వుంటే తెలంగాణాలో కూడా ఏపీ విషయంలో హాట్ టాపిక్ నడుస్తుంది.

మొన్న హరీష్ ,, నిన్న రేవంత్ ... ఏపీపై ఆసక్తికర వ్యాఖ్యలు

మొన్న హరీష్ ,, నిన్న రేవంత్ ... ఏపీపై ఆసక్తికర వ్యాఖ్యలు

మొన్నటికి మొన్న టీఆర్ఎస్ కీలక నాయకుడు ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావ్ ఏపీ లో నెలకొన్న పరిస్థితులను చూసి ఎంత వ్యంగ్యంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఏపీలో రాజధాని రగడ నేపధ్యంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రాలో నెలకొన్న పరిస్థితుల మూలంగా ఒక తెలంగాణ బిడ్డగా తాను గర్వపడుతున్నాను అని అన్నారు.

తెలంగాణా రియల్ ఎస్టేట్ రంగం ఏపీ వల్ల లాభపడుతుందన్న నేతలు

నిన్నటి వరకు సోదరులుగా ఉన్న రాష్ట్రంలో ముసలం పుట్టడం బాధగా ఉందన్నారు. తెలంగాణలో ఓ స్థిరాస్థి వ్యాపారికి మేలు చేసేందుకే గందరగోళం సృష్టించారని ఏపీ సర్కారుపై రేవంత్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో రాజధానుల విషయంలో నెలకొన్న పరిస్థితులు తెలంగాణాకు బాగా లాభిస్తాయని తెలంగాణా నేతల మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో తాజా పరిణామాలు నష్టాన్ని చేస్తుంటే అవే తెలంగాణాకు లాభం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.

 హరీష్, రేవంత్ ల వీడియోలు పోస్ట్ చేసి ఏపీ పరిస్థితి ఇదంటూ లోకేష్ అసహనం

హరీష్, రేవంత్ ల వీడియోలు పోస్ట్ చేసి ఏపీ పరిస్థితి ఇదంటూ లోకేష్ అసహనం

ఇక ఇప్పుడు తెలంగాణాలోని పాలక, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు ఏపీలో చర్చకు కారణం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు వీడియోలను కలిపి టీడీపీ నేత మాజీ మెంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఏపీలో పరిస్థితి అర్ధం అయ్యేలా చెప్పారు ."ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ పరిపాలన పుణ్యమా అని, ఒకే తాటిపైకి వచ్చిన పక్క రాష్ట్రం, పాలక పక్షం, ప్రతిపక్షం. పిచ్చి తుగ్లక్ పాలన వలన మన రాష్ట్రం బీహార్ తో పోటీ పడే స్థాయికి దిగజారడం చూసి మన కర్మ అని అనుకోడం తప్ప ప్రజలు చేసేది ఏమి లేదు." అంటూ ట్వీట్ చేసి అసహనం వ్యక్తం చేశారు.

English summary
Telangana's ruling and opposition leaders comments on AP's present situation have been the subject of debate in the AP. In this context, the TDP leader Nara Lokesh said on social media platform that the situation in AP has become meaningless. " There is nothing that people do except to think that it is our karma to see our state deteriorate to the level of competition with Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X