వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ క్యాబినెట్ లో ఆ ఇద్ద‌రికి చోటు..! విస్త‌ర‌ణ‌కు నేడో రేపో ముహూర్తం..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: ఏపీ క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎప్ప‌టినుండో పెండింగ్ లో ఉన్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రార‌యిన‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబు క్యాబినెట్ లోకి రెండు కొత్త‌ముఖాలు రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. బీజేపి కి రాం రాం చెప్పిన త‌ర్వాత ఇద్ద‌రు బీజెపి మంత్రులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే..! ఇప్పుడు ఆ రెడు మంత్రి ప‌ద‌వుల‌ను ఇత‌రుల‌కు ఇచ్చేందుకు బాబు సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. చంద్రబాబు క్యాబినెట్ లో చేర‌బోయే ఆ ఇద్ద‌రు ఎవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

Recommended Video

త్వరలో మంత్రివర్గ విస్తరణ తేల్చేసిన చంద్రబాబు
 ఏపి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు రెఢీ..! ఇద్ద‌రు కొత్త‌వాళ్ల‌కు అవకాశం ఇవ్వ‌నున్న చంద్ర‌బాబు..!

ఏపి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు రెఢీ..! ఇద్ద‌రు కొత్త‌వాళ్ల‌కు అవకాశం ఇవ్వ‌నున్న చంద్ర‌బాబు..!

గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ కొంత కాలం క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు కలిసి పని చేయడం వల్ల ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రం ప్రభుత్వంలో రెండు పార్టీలు భాగస్వామ్యంగా ఉండేవి. విభజన హామీల విషయంలో ఏపీని కేంద్రం మోసం చేసిందనే కారణంతో టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఆసమయంలో కేంద్ర కేబినెట్‌లో ఉన్న టీడీపీ మంత్రులు.. ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామాలు చేశారు. ఇక అప్పటి నుంచి ఆ రెండు శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. దీంతో ఆ రెండు శాఖలను ఎవరికైనా అప్పగించాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు.

 అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత విస్త‌ర‌ణ ఖాయం..! ఆశావ‌హుల్లో ఆనందం..!

అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత విస్త‌ర‌ణ ఖాయం..! ఆశావ‌హుల్లో ఆనందం..!

మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రెండు నెలలుగా ఇదే విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మ‌రోసారి కేబినెట్‌ను విస్తరిస్తామని, నటుడు హరికృష్ణ మరణంతో అది ఆలస్యమైందని సీఎం చంద్రబాబు చెప్పడంతో త్వరలో కొత్త మంత్రులు రాబోతున్నారని తెలిసిపోయింది. దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. విస్తరణకు డేట్ ఫిక్స్ అయిందని, అందులో ఇద్దరికి స్థానం కల్పిస్తున్నారన్న వార్త‌లు ఊపందుకున్నాయి.

సొంత‌పార్టీ నేత‌ల‌కే ప్రాముఖ్య‌త‌..! వ‌ల‌స నేత‌ల‌కు నో ఛాన్స్..!

సొంత‌పార్టీ నేత‌ల‌కే ప్రాముఖ్య‌త‌..! వ‌ల‌స నేత‌ల‌కు నో ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో, దానికి ముందు గానీ, త‌ర్వాత గాని మంత్రి వర్గ విస్తరణ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని స‌మాచారం. ఇందులో ఒకదానిని ఎస్టీ సామాజిక వర్గానికి, మరొక దానిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే దేవాదాయ శాఖను ఎస్టీ కోటాలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు, వైద్య, ఆరోగ్య శాఖ ఓ ముస్లిం నేతకు అప్పగించబోతున్నారని సమాచారం. వాస్తవానికి ఈ కోటాలో గిడ్డి ఈశ్వరికి పదవి ఇవ్వాలని అనుకున్నా కొన్ని కార‌ణాల వ‌ల్ల అది సాద్యం కావ‌డంలేద‌ని తెలుస్తోంది.

సీనియ‌ర్ల‌కు గుర్తింపు..! మైనారిటి అభ్య‌ర్థికి కూడా అవ‌కాశం అంటున్న పార్టీ నేత‌లు..!

సీనియ‌ర్ల‌కు గుర్తింపు..! మైనారిటి అభ్య‌ర్థికి కూడా అవ‌కాశం అంటున్న పార్టీ నేత‌లు..!

ఆ రెండు శాఖల్లో ఒకదానిని ముస్లిం నేతకు అప్పగించాలని చూస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వారి కంటే టీడీపీని నమ్ముకుని ఉన్న ముస్లిం నేత అయితేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీలు ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిలో ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్నందున, మరో ఎమ్మెల్సీ షరీఫ్‌కే మంత్రి పదవి ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్న గుంటూరులో జ‌రిగిన ముస్లిం కార్య‌క్ర‌మంలో కూడా ష‌రీఫ్ అత్యంత ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు చంద్ర‌బాబు. దీంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న సంకేతాలు వెలువ‌డ్డాయి.

English summary
ap cm chandra babu naidu willing expand his cabinet. babu is giving opportunity for two new faces. two portfolios are ready to give others which was kept with chandrabau. sources saying that the expansion takes place very soon..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X