నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ అంశాలపై వెంకయ్య కసరత్తు - కేంద్ర మంత్రులతో వరుసగా..!!

|
Google Oneindia TeluguNews

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీకి చెందిన అంశాలు - సమస్యల పరిష్కారం పైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో..ఉన్నతాధికారులో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 10న వెంకయ్య నాయుడు పదవీ విరమణ చేయనున్నారు. గతంతోనూ ఇటువంటి సమావేశాలు నిర్వహించిన వెంకయ్య...ఇప్పుడు వాటి పురోగతితో పాటుగా..ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర సంస్థల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

ఏపీపై కేంద్ర మంత్రులతో సమావేశాలు

ఏపీపై కేంద్ర మంత్రులతో సమావేశాలు

అందులో భాగంగా వరుసగా రెండో రోజు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషీతో సమావేశాలు నిర్వహించారు. కేంద్ర పరిధిలో ఏర్పాటు చేయాల్సి సంస్థలకు సంబంధించి వారితో చర్చించారు. త్వరిత గతిన వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురంలోని పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బీఈఎల్ ఢిఫెన్స్ సిస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ గురించి ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ లో మాట్లాడారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న కేంద్ర సంస్థలకు నిధుల విడుదల గురించి ఆరా తీసారు. ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.

నిధుల విడుదల పైనా చర్చలు

నిధుల విడుదల పైనా చర్చలు

నెల్లూరులో ఏర్పాటు చేయనున్న హై ఎండ్ అల్యూమినియం సంస్థ పనులపైన మంత్రి ప్రహ్లాద్ జోషీతో చర్చించారు. ఈ సంస్థ ను దాదాపుగా 110 ఎకరాల్లో ఏర్పాటు చేయటం ద్వారా 400 మందికి ఉపాధికి ప్రత్యక్షంగా అవకాశం దక్కుతుంది. రూ 4500 కోట్లతో ఈ ప్రాజెక్టును వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పటికే ఏపీలో ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రారంభమైన పలు సంస్థలు అనేక దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయటం పైన ఇప్పటికే కేంద్ర అధికారులతోనూ వెంకయ్యా నాయుడు చర్చించారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించిన ఆయన, ఉప రాష్ట్రపతి అయిన తరువాత కూడా ఈ సమావేశాలను కొనసాగిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలంటూ

రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలంటూ

ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమంలో ఎక్కడైనా సమస్యలుంటే రాష్ట్ర మంత్రులు..ఏపీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో...ఏపీ పునర్విభజన చట్టం ఆమోదం వేళ వెంకయ్య నాయుడు రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో పలు మార్పులను సూచించారు. ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు..పదేళ్లు కావాలంటూ పట్టుబట్టారు. అయితే, కేంద్ర సంస్థల ఏర్పాటు విషయంలో మాత్రం 2014లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి నాడు మంత్రిగా.. ఆ తరువాత ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అనేక సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే విధంగా.. వాటిని పూర్తి చేసేలా కేంద్ర మంత్రులతో పర్యవేక్షణ చేస్తున్నారు.

English summary
Vice Preident Venkaiah Naidu Review on Central Organisations establishment in AP wiht Central ministers and Officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X