విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్ధన్ దేశాలు దాటొచ్చు, చిరంజీవి పని తప్పుగా అనిపించలేదా: పవన్‌కు వర్ల

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఆ పార్టీ నేత జోగి రమేష్ 100 రెట్లు బెట్టర్ అని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య గురువారం అన్నారు. జగన్ పైన విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి ఘటనలో నోటీసులు అందుకున్న రమేష్ వ్యవస్థను గౌరవించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని చెప్పారు.

<strong>అది సరికాదు, పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు: పవన్‌పై నటి మాధవీలత</strong>అది సరికాదు, పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు: పవన్‌పై నటి మాధవీలత

పవన్ కళ్యాణ్ పరిణితి లేని నాయకుడు

పవన్ కళ్యాణ్ పరిణితి లేని నాయకుడు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిణితి లేని నాయకుడు వర్ల అన్నారు. అతను రాతి నేలపై నాటిన మొక్కలాంటి వాడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలకు అధికార ప్రతినిధిలా జనసేనాని వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

చిరంజీవి చేసింది తప్పుగా అనిపించలేదా?

చిరంజీవి చేసింది తప్పుగా అనిపించలేదా?

తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత మూడేళ్లకే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు పవన్ కళ్యాణ్‌కు తప్పుగా అనిపించలేదా అని వర్ల ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో తాము జత కలిస్తే విమర్శించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వస్తానని చెబుతున్నారు. ఇందులో భాగంగా రాహుల్‌ను కలిశారు. కానీ దీనిపై వైసీపీ, బీజేపీ, జనసేనలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

జగన్ విశ్రాంతి

జగన్ విశ్రాంతి

జగన్ కోడి కత్తి డ్రామాను రక్తి కట్టించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారని వర్ల అన్నారు. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీకి మానసపుత్రుడు అన్నారు. మోడీ హయాంలోనే గాలి జనార్ధన్ రెడ్డి దేశాలు దాటి వెళ్లవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.

జగన్ కేసులో ఆరోపణలు సరికాదు

జగన్ కేసులో ఆరోపణలు సరికాదు

జగన్‌పై దాడి ఓ సినిమాలా అనిపిస్తోందని మంత్రి ఆది నారాయణ రెడ్డి అంతకుముందే విమర్శలు గుప్పించారు. ఏపీ పోలీస్ అధికారులు చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్నారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికాదని చెప్పారు. ఈ కేసు విషయంలో వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు విశాఖ పోలీసు కమిషనర్‌ లడ్డా ఎవరిమాట వినకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపే అధికారి అనే విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలన్నారు.

English summary
Why Jana Sena chief Pawan Kalyan not questioned his brother Chiranjeevi for merging PRP in Congress, asked Telugudesam party leader Varla Ramaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X