చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి... చెన్నై స్వగృహంలో మూడు వారాలు విశ్రాంతి...

|
Google Oneindia TeluguNews

చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్‌ మలర్‌ ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని స్వగృహానికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు. డిశ్చార్జి సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్, కుటుంబ సభ్యులతో కలిసి రోజా ఫోటోలు దిగారు. కొద్దిరోజుల క్రితం మలర్ ఆస్పత్రిలో రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగిన సంగతి తెలిసిందే.

సర్జరీ వాయిదా వేయాలని కోరినప్పటికీ..

సర్జరీ వాయిదా వేయాలని కోరినప్పటికీ..

దాదాపు వారం రోజులకు పైగా రోజా మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని భర్త ఆర్కే సెల్వమణి వెల్లడించారు. నిజానికి గత ఏడాదే రోజాకు సర్జరీ చేయాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సర్జరీని వాయిదా వేశారు. ఇటీవల సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లగా... వెంటనే సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. అయితే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పూర్తయ్యేంతవరకూ రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరినప్పటికీ... అది మంచి నిర్ణయం కాదని వైద్యులు వారించినట్లు సెల్వమణి తెలిపారు. దీంతో ఇక ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నట్లు చెప్పారు.

రోజాకు సీఎం జగన్ ఫోన్...

రోజాకు సీఎం జగన్ ఫోన్...

సర్జరీ చేయించుకున్న ఎమ్మెల్యే రోజాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించిన సంగతి తెలిసిందే. రోజాకు ఫోన్‌ చేసిన సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అవేవీ పట్టించుకోకుండా ప్రస్తుతానికి ఆరోగ్యం పైనే శ్రద్ద పెట్టాలని సూచించారు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.

నగరిలో ప్రత్యేక పూజలు

నగరిలో ప్రత్యేక పూజలు

మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ నగరి వైసీపీ నాయకులు శనివారం(ఏప్రిల్ 3) శ్రీదేశమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే పేరిట అర్చనలు చేసి, 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ బాబురెడ్డి, ఆస్పత్రి కమిటీ డైరెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవరాజులు రెడ్డి, మధు, బాలాజీ, సుబ్రమణ్యం, రామన్, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

నేసనూరులోని స్థానిక గ్రామ దేవత శ్రీ కలుగు లక్ష్మమ్మ ఆలయంలోనూ వైసీపీ నేతలు సర్పంచ్ గోవిందస్వామిరెడ్డి ఆధ్వర్యంలోప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రోజా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని దేవతను మొక్కుకున్నారు.

English summary
MLA Roja has been discharged from Fortis Malar Hospital in Adyar, Chennai. The family members then took her to her home in Chennai. She will take rest for three weeks as per the doctors ’recommendation. During the discharge, Roja posed for photos with her husband RK Selvamani, daughter Anshumalika, son Krishna Kaushik and family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X