బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్లిక్ టాయిలెట్ గోడలపై 'సెక్స్ వర్కర్' ఫోన్ నంబర్... అసలు కథ వేరే.. ఓ టీచర్ నీచపు బుద్ది...

|
Google Oneindia TeluguNews

ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌తో చనువుగా ఉండేందుకు ప్రయత్నించిన ఓ టీచర్.. హద్దుల్లో ఉండాలని ఆమె తేల్చి చెప్పడంతో అప్పటినుంచి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె పరువు తీయాలన్న దురుద్దేశంతో నీచపు పనికి ఒడిగట్టాడు. ఓ పబ్లిక్ టాయిలెట్ వాల్‌పై ఆమె ఫోన్ నంబర్ రాసి సెక్స్ వర్కర్ కాంటాక్ట్ నంబర్‌గా పేర్కొన్నాడు.

దీంతో అప్పటినుంచి ఆమెకు విపరీతమైన ఫోన్లు రావడం మొదలయ్యాయి. ఆ ఫోన్ నంబర్‌ నిజంగానే సెక్స్ వర్కర్‌‌ది అనుకుని చాలామంది అందుకోసమే ఆమెకు ఫోన్ చేసి విసిగించడం మొదలుపెట్టారు. ఆ ఫోన్ కాల్స్ భరించలేకపోయిన ఆ మహిళా కానిస్టేబుల్... ఎట్టకేలకు దీని వెనకాల ఉన్న అసలు విషయాన్ని గ్రహించగలిగింది. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

ఇదీ జరిగింది...

ఇదీ జరిగింది...

కర్ణాటకలోని చిక్‌మంగళూరు పరిధిలోని కదూర్‌కి చెందిన సతీష్(33) ప్రస్తుతం టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పట్టణంలో నందిని(పేరు మార్చాం) అనే మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితమే ఆమెకు వివాహం కూడా జరిగింది. సతీష్,నందిని ఇద్దరు ఒకప్పుడు క్లాస్‌మేట్స్.కొన్నాళ్ల క్రితం స్నేహితులు ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో ఈ ఇద్దరి నంబర్స్ చేర్చారు. అప్పటివరకూ ఈ ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేదు.

చనువుగా ఉండేందుకు ప్రయత్నించి...

చనువుగా ఉండేందుకు ప్రయత్నించి...

వాట్సాప్ గ్రూప్ నుంచి నందిని ఫోన్ నంబర్ తీసుకున్న సతీష్... ఆమెకు తరుచూ మెసేజ్‌లు,ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. చాలాసార్లు ఆమెతో చనువుతో ఉండేందుకు ప్రయత్నించి భంగపడ్డాడు. సతీష్ హద్దు మీరుతున్నాడని తెలిసి నందిని అతన్ని గట్టిగానే మందలించింది. దీంతో అప్పటినుంచి మెసేజ్‌లు చేయడం మానేశాడు. అదే సమయంలో నందిని ఫోన్ నంబర్‌ను తమ క్లాస్‌మేట్స్ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడు. దీంతో గ్రూపులో ఇతర సభ్యులు నందినిని మళ్లీ యాడ్ చేశారు. ఆ తర్వాత కూడా సతీష్ ఆమెను మళ్లీ గ్రూపు నుంచి తొలగించడం... స్నేహితులు యాడ్ చేయడం జరుగుతూ వచ్చింది.

పబ్లిక్ టాయిలెట్ గోడలపై...

పబ్లిక్ టాయిలెట్ గోడలపై...

ఈ వ్యవహారంపై నందిని ఒకరోజు సతీష్‌కు ఫోన్ చేసి గట్టిగా హెచ్చరించింది. ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించింది. అప్పటినుంచి ఆమెపై కక్ష పెంచుకున్న సతీష్.. కదూర్ పట్టణంలో బస్టాండ్‌ సమీపంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ వాల్‌పై ఆమె ఫోన్ నంబర్,దాని పక్కనే సెక్స్ వర్కర్ కాంటాక్ట్‌ నంబర్ అని రాశాడు. అప్పటినుంచి నందిని ఫోన్‌కు విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. ఫోన్ చేసినవాళ్లు అసభ్యంగా మాట్లాడుతుండటం,ఆమెను సెక్స్ వర్కర్‌గా సంబోధిస్తుండటంతో అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.

ఎట్టకేలకు ఆ టీచర్ అరెస్టు...

ఎట్టకేలకు ఆ టీచర్ అరెస్టు...

ఎట్టకేలకు నందిని అసలు విషయాన్ని గుర్తించగలిగింది. డిసెంబర్ 15న తన భర్తను వెంటపెట్టుకుని కదూర్ బస్టాండ్‌కి వెళ్లింది. అక్కడ ఆమె భర్త పబ్లిక్ టాయిలెట్‌ లోపలికి వెళ్లి పరిశీలించగా... దాని వాల్‌పై నందిని ఫోన్ నంబర్ కనిపించింది. పక్కనే సెక్స్ వర్కర్ అని రాసి ఉండటం చూసి షాక్ తిన్నాడు. దాన్ని సెల్‌ఫోన్‌లో ఫోటో తీయగా... ఆ రాతను సతీష్ హ్యాండ్ రైటింగ్‌గా నందిని గుర్తించింది. వెంటనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులు సోమవారం(డిసెంబర్ 21) సతీష్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

English summary
In a shameful incident reported from Chikkamagaluru district in Karnataka, a 33-year-old teacher, allegedly scribbled the name and phone number of a woman police constable on the walls of public toilets. The accused, identified as Satish CM of Kadur, was arrested on Monday, following a complaint by the 32-year-old female cop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X