• search
  • Live TV
తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎఎస్సై ప్రమోషన్.. అంతలోనే దుర్మరణం.. లారీ టైర్ల కింద పడ్డ లేడీ హెడ్ కానిస్టేబుల్..!

|

పిఠాపురం : మనుషులతో విధి ఆడే నాటకం విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు అద‌ృష్టం ఇచ్చినట్లే ఇచ్చి.. ఆ వెంటనే దురద‌ృష్టం కూడా కట్టబెడుతుంది. అదే కోవలో ఉన్నతంగా ఎదగాలని ఆశించిన ఓ లేడీ హెడ్ కానిస్టేబుల్‌కు ఎఎస్సైగా ప్రమోషన్ ఇలా వచ్చిందో లేదో అలా మృత్యువు వెంటాడింది. ఖాకీ దుస్తులతో ప్రజలకు రక్షణగా ఉంటానని భావించిన సదరు మహిళా పోలీస్‌ను విధి వేటాడింది. విధినిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదానికి గురై నడిరోడ్డు మీద ప్రాణాలు విడిచిన ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

లేడీ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి

లేడీ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 47 సంవత్సరాల కూటి విజయలక్ష్మి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. రంగంపేట శివారులోని అట్టల పరిశ్రమ దగ్గర గురువారం నాడు జరిగిన యాక్సిడెంట్‌లో ప్రాణాలు విడిచారు. ఓ కేసుకు సంబంధించి రాజ మహేంద్రవరం కోర్టుకు హాజరయ్యే నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది.

ఉదయం 9 గంటల ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంపై బయలుదేరిన విజయలక్ష్మి అట్టల పరిశ్రమ దగ్గరకు చేరుకోగానే.. పెద్దాపురం నుంచి రాజానగరం వైపు వెళుతున్న లారీ బలంగా ఢీకొట్టింది. అంతేకాదు కొద్ది దూరం వరకు ఆమెను అలానే ఈడ్చుకుంటూ ముందుకెళ్లిపోయాడు లారీ డ్రైవర్. అయితే లారీ టైర్ల కింద చిక్కుకున్న విజయలక్ష్మి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

ప్లాన్ ప్రకారమే మర్డర్.. తల ఒకచోట.. మొండెం మరోచోట..!

ఎఎస్సైగా ప్రమోషన్.. అంతలోనే దుర్మరణం

ఎఎస్సైగా ప్రమోషన్.. అంతలోనే దుర్మరణం

హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మికి ఇటీవలే ఎఎస్సైగా ప్రమోషన్ వచ్చింది. ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. అదే క్రమంలో ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రమోషన్ వచ్చిన తరుణంలో ఇలా చనిపోవడం విధి రాత అంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. హెడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక మెట్టు ఎదిగి ఎఎస్సైగా బాధ్యతలు నిర్వహించాల్సింది పోయి కానరాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు బాధపడుతున్న తీరుతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా ఎస్పీ

కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా ఎస్పీ

విధి నిర్వహణలో భాగంగా కోర్టుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం అంటున్నారు సహోద్యోగులు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఓ కేసులో సాక్ష్యం చెప్పడానికంటూ కోర్టుకు బయలుదేరిన విజయలక్ష్మిని ఆకస్మాత్తుగా ఇలా లారీ ఢీకొట్టడం ఏంటనే వాదనలు లేకపోలేదు. అయితే రంగంపేట వీఆర్‌వో శ్రీనివాస్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రంగంపేట ఇన్‌ఛార్జ్ ఎస్సైగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సామర్లకోట ఎస్సై సుమంత్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా హెడ్ కానిస్టేబుల్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు జిల్లా ఎస్పీ నయీం అస్మీ. ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పోలీస్ శాఖ నుంచి ఆర్థిక సాయం ఇతరత్రా ఏదైనా ఉంటే కుటుంబ సభ్యులకు అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The death of a lady head constable who had hoped to rise to the same level as an ASI promotion was haunted. The fate of the woman police, which was supposed to protect the public with khaki clothes. This heart-wrenching incident took place in the East Godavari district as a result of road accident and death on the roadside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more