వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: మందులతో కాకుండా హై బీపీని కంట్రోల్ చెయ్యటానికి ఐదుమార్గాలు!!

|
Google Oneindia TeluguNews

ప్రస్తుత సమాజంలో రక్తపోటు ఒక ప్రధాన సమస్యగా మారింది. భారతదేశంలో ఈ సమస్య విపరీతంగా పెరిగింది. వందకు 70 శాతం మంది రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. వేగంగా మారుతున్న జీవనశైలి, వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలలోని ఒత్తిడి, అధిక బరువు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, ధూమపానం, శారీరకంగా శ్రమ చేయకపోవడం, మానసిక ఒత్తిడి హై బీపీ రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఇక వీటితో పాటుగా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా బిపి రావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

health tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? వేగంగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి!!health tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? వేగంగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి!!

 రక్తపోటును తగ్గించడానికి జీవనశైలిదే కీలకపాత్ర

రక్తపోటును తగ్గించడానికి జీవనశైలిదే కీలకపాత్ర


మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, రక్తపోటును తగ్గించడానికి మందుల కంటే చికిత్సలో జీవనశైలి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో రక్తపోటును నియంత్రించడం ద్వారా మందుల అవసరాన్ని నిరోధించవచ్చు, ఆలస్యం చేయవచ్చు లేదా తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. 10 రకాలైన జీవనశైలి మార్పులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి అని సూచిస్తున్నారు.

 అధిక బరువును తగ్గించుకోండి

అధిక బరువును తగ్గించుకోండి


బరువు పెరిగే కొద్దీ రక్తపోటు తరచుగా పెరుగుతుంది. అధిక బరువు ఉండటం వలన మీరు నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలగవచ్చు ఇది రక్తపోటును మరింత పెంచుతుంది. ఇక రక్తపోటును నియంత్రించడానికి జీవనశైలి మార్పుల్లో భాగంగా బరువు తగ్గడం అత్యంత ముఖ్యమైన విషయం. అధిక బరువు ఉన్న వారికి రక్తపోటు ఎక్కువగా ఉంటుందని, బరువు తగ్గడం వల్ల అది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది అని చెబుతున్నారు.

 క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి

క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి


ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుందని చెబుతున్నారు. శారీరక శ్రమ రక్తపోటును నియంత్రిస్తుందని సూచిస్తున్నారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే రక్తపోటును నియంత్రించవచ్చునని సూచిస్తున్నారు. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా డ్యాన్స్ వంటివి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి


ఇక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా రక్తపోటును నియంత్రిస్తుందని చెబుతున్నారు .తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వలన అధిక రక్తపోటు తగ్గుతుందని సూచిస్తున్నారు. ఆహారంలో ఉప్పు ను తక్కువ చేయడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చునని, సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదని చెబుతున్నారు.

 ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పొండి

ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పొండి


కొంతమంది నిద్రలేమి సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరిగ్గా నిద్రపోకపోవడం- అనేక వారాలపాటు ప్రతి రాత్రి ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవడం - రక్తపోటుకు దోహదం చేస్తుంది. నిద్రలేమి సమస్యలు నిద్రకు భంగం కలిగిస్తాయి. ప్రశాంతమైన నిద్రపోయే వారిలో రక్తపోటు కంట్రోల్ లో ఉంటుందని చెబుతున్నారు. ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోయే వారిలో రక్తపోటు కంట్రోల్ లో ఉంటుందని చెబుతున్నారు

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడిని తగ్గించుకోండి


ఇక ఒత్తిడిని తగ్గించుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. చాలా అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడి అని చెబుతున్న వైద్యులు, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా మంచి సాధనం అని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని, నిత్యం ఒత్తిడితో కూడిన పని చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకుంటే బీపి కంట్రోల్ లో ఉంటుందని, సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకుంటే ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుందని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Doctors suggest five ways to prevent high BP other than medicine. It is said that BP can be controlled by losing weight, exercising regularly, eating a regular diet, sleeping well, and reducing stress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X