guntur district fear chicken andhrapradesh telangana alert గుంటూరు జిల్లా భయం చికెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హెచ్చరిక Bird flu
గుంటూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం .. అధికారుల సమీక్ష, చికెన్ తినాలంటే మొదలైన భయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలం గుదిబండివారిపాలెంలో కాకులు మృతిచెందడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గుదిబండి వారి పాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆరు కాకులు చచ్చిపోవడంతో, కాకుల మృతి బర్డ్ ఫ్లూ కారణంగానే అంటూ ప్రచారం కొనసాగుతుంది. బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరిస్తున్న వదంతుల నేపథ్యంలో ప్రజలు మాంసం తినాలి అంటేనే భయపడుతున్నారు.

ఏపీ ,తెలంగాణా రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ భయం: ప్రభుత్వాల ముందు జాగ్రత్త,అధికారులు అలెర్ట్

బర్డ్ ఫ్లూ ఆందోళన వద్దు ... నిర్భయంగా చికెన్ తినండి: ఏపీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్
చికెన్ కు ఆమడ దూరం పారిపోతున్నారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు . ఇప్పటివరకు ఏపీలో ఎక్కడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు . ప్రజలు నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చని ఆయన పేర్కొన్నారు .అన్ని జిల్లాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించాలని పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ కూడా అలర్ట్ గానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి భయం లేకుండా చికెన్ తినొచ్చని స్పష్టం చేశారు డాక్టర్ రవీంద్ర కుమార్.

బర్డ్ ఫ్లూ లక్షణాలతో పక్షులు చనిపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలి
ఎక్కువగా వలస పక్షుల వల్ల బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైద్య శాఖ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు అని స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ లక్షణాలతో పక్షులు చనిపోతే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి బర్డ్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.

తెలంగాణాలోనూ బర్డ్ ఫ్లూ పై అత్యవసర సమావేశం
వలస పక్షులపై ఆరా తీసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో నిర్భయంగా చికెన్ తినొచ్చని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా పౌల్ట్రీ ఫామ్ లకు సంబంధించిన యజమానుల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ సంఖ్యలో కోళ్లు చనిపోతే శాంపిల్స్ ను పరీక్షకు పంపాలని ఆదేశించారు. 13 వందల మంది తో రాష్ట్రవ్యాప్తంగా టీమ్స్ ను ఏర్పాటు చేసి పౌల్ట్రీ ఫామ్ లను పర్యవేక్షిస్తున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.