వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హృదయాన్ని కదిలించే కుక్క, ఎద్దు స్నేహం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మంగళూరులో ఓ హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ఓ కుక్క, ఎద్దు చాలాకాలంగా స్నేహితులుగా ఉంటున్నాయి.

మంగళూరులోని అట్టావర్ ప్రాంతంలో చాలాకాలంగా ఓ కుక్క, ఎద్దు స్నేహంగా ఉంటున్నాయి. ఈ రెండింటి స్నేహాన్ని స్థానికులు చాలారోజులుగా గమనిస్తున్నారు.

ఈ రెండు ఎంతోకాలంగా అదే ప్రాంతంలో ఉంటున్నాయి. ఎద్దు నిద్రిపోతుంటే కుక్క కాపలా ఉండేదట. ఎద్దు లేచిన తర్వాతనే కుక్క నిద్ర పోయేదట.

ఎద్దు - కుక్క

ఎద్దు - కుక్క

ఎద్దు, కుక్కల స్నేహం స్థానికులు చూసి ముచ్చట పడేవారు. అయితే, ఇంతలోనే ఓ విషాద సంఘటన జరిగింది. ఆగస్టు 24వ తేదీన జైన్ కాంపౌండులో ఎద్దు మృతి చెందింది.

ఎద్దు - కుక్క

ఎద్దు - కుక్క

ఎద్దు మృతి చెందడంతో ఆ కుక్క అక్కడే కాపలాగా ఉంది. స్థానికులను, ఇతరులను ఎవరిని కూడా అక్కడకు వెళ్లనీయలేదు. ఎద్దు పడుకుందనుకుందో లేదా మరేమో కానీ ఎద్దు వద్దకు ఎవరైనా వెళ్తే మాత్రం కుక్క ఆపుతోంది.

ఎద్దు - కుక్క

ఎద్దు - కుక్క

చాలాసేపటి తర్వాత.. చాలామంది వచ్చిన తర్వాత కానీ ఆ కుక్క ఎద్దు దగ్గరి నుండి కొంత పక్కకు జరగలేదు. స్థానికులు ఆ ఎద్దును ఖననం చేశారు.

ఎద్దు - కుక్క

ఎద్దు - కుక్క

ఎద్దును ఖననం చేసిన తర్వాత స్థానికులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే స్నేహంగా ఉన్న కుక్క మాత్రం అక్కడే కూర్చొని ఉంది.

ఎద్దు - కుక్క

ఎద్దు - కుక్క

ఇప్పటి వరకు అక్కడి నుండి కదలలేదు. ఆహారం, నీరు తీసుకోవడానికి కూడా వెళ్లలేదు. ఈ సంఘటన చూసిన వారిని కదిలిస్తోంది.

English summary

 A heart touching story of unusual attachment between an ox and a stray dog at Attavar, Mangalore. For many years dog and ox Shambu were friends. Sadly, on August 24, tragedy struck, the ox died near Jain Compound.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X