చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దెబ్బ అంటే ఇదే: జల్లికట్టు ధర్నాలో యూనీఫాంలో పోలీస్

చెన్నైలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తి యూనీఫాంలో మెరీనా బీచ్ లోకి వెళ్లి జల్లికట్టుకు మద్దతు తెలిపారు. తనకు ఉద్యోగం కంటే తమిళ సాంప్రదాయం ముఖ్యం, జల్లికట్టు నిర్వహణకు అనుమతి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో ఓవైపు జల్లికట్టు రాజకీయాలు జరుగుతున్నాయి. విద్యార్థి లోకం జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని గర్జిస్తోంది. పలువురు రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థులకు మద్దతు తెలుపుతూ జల్లికట్టు కోసం నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గోంటున్నారు.

బెంగళూరులో దుమ్ములేపిన తమిళ తంబీలు: జల్లికట్టు ఎఫెక్ట్

జల్లికట్టుకు మద్దతుగా ఇప్పటికే తమిళ సినీరంగ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మద్దతు ఇచ్చారు. చెన్నై నగరంలోని మెరీనా బీచ్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఊహించని మద్దతు తెలిపారు.

A Police participated in Marina protest for supporting Jallikattu

చెన్నై నగరంలో పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి యూనిఫాంలో ధర్నా చేస్తున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లారు. మైక్ తీసుకుని తనకు ఉద్యోగం కంటే తమిళ సాంప్రదాయం ముఖ్యం అని గట్టిగా చెప్పారు.

జల్లికట్టు దెబ్బ: ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం: ఏం చెప్పారంటే !

జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని నినాదాలు చెయ్యడంతో సాటి పోలీసులు షాక్ కు గురైనారు. పై అధికారులకు తెలిస్తే ఉద్యోగం ఊడిపోతుందని సాటి పోలీసులు ఆయనకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న జల్లికట్టు నిర్వహణ సాంప్రదాయాన్ని కొందరు స్వార్థం కోసం అడ్డంపడుతున్నారని ఆ పోలీసు విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగాన్ని లెక్క చెయ్యకుండా పోలీసు యూనీఫాంతో వచ్చి జల్లికట్టుకు మద్దతు తెలిపిన పోలీసును నీవే నిజమైన హీరో అంటూ అక్కడ ఉన్న విద్యార్థులు అభినందించారు.

English summary
A Police participated in Marina protest for supporting Jallikattu with police uniform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X