బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం తరలిస్తూ దొరికితే రూ. 50 లక్షల లంచం: ఏసీపీ సస్పెండ్, బలి పశువును చేశారా?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో రాత్రినక పగలనక సేవలందిస్తున్న పోలీసులపై సర్వత్రా ప్రశంసలందుతున్నాయి. కానీ, ఒక్కరిద్దరు చేస్తున్న కక్కుర్తి పనులు ఆ శాఖకే మచ్చ తెచ్చేలా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.

రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన ఏసీపీ సస్పెండ్..

రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన ఏసీపీ సస్పెండ్..

లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మద్యం షాపులను కూడా మూసివేయాల్సిందేనని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కొంతమంది అత్యధిక ధర కలిగిన 100 మద్యం బాటిళ్లను ఓ వాహనంలో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కాగా, రూ. 50 లక్షల ఇస్తే వదిలేస్తానంటూ వారికి ఆఫర్ ఇచ్చారు బెంగళూరు తూర్పు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాసు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వాసును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మద్యం తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు డెక్కన్ హెరాల్డ్ తన కథనంలో వెల్లడించింది.

మద్యం నిందితులకు అడిషనల్ సీపీకి సంబంధం?

మద్యం నిందితులకు అడిషనల్ సీపీకి సంబంధం?

ఏప్రిల్ 11న జీఎస్టీ ఎమర్జెన్సీ బోర్డు పెట్టుకున్న ఓ టాటా సుమో కారు వెళుతుండగా అనుమానం వచ్చి ఏసీపీ వాసు.. ఆ వాహనాన్ని బెట్టడసనపుర మెయిన్ రోడ్డు వద్ద ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో 8 కర్టన్ బాక్సులలో 100 మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో వాటిని సీజ్ చేసిన ఏసీపీ వాసు.. విశేష్ గుప్తా, గోపా అనే నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే, తమకు ఓ పోలీసు ఉన్నతాధికారి బాగా తెలుసునని నిందితులు ఏసీపీతో చెప్పారు. అంతేగాక, తమను విడిచిపెడితే రూ. 50లక్షలు ఇస్తామని, ఆ వాహనంలో తరలిస్తున్న మద్యం బాటిళ్లు కూడా అడిషనల్ సీపీ మురగన్‌కు అందించాల్సి వుందని నిందితులిద్దరూ తెలిపారని ఏసీపీ వాసు చెప్పారు.

నిందితులకు బెయిల్ ఇవ్వాలంటూ అడిషనల్ సీపీ..

నిందితులకు బెయిల్ ఇవ్వాలంటూ అడిషనల్ సీపీ..

నిందితులిద్దరిపై కేసు నమోదు చేసిన ఏసీపీ.. వారిని విచారించారు. కాగా, ఏప్రిల్ 12న బెంగళూరు తూర్పు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ మురుగన్.. ఏసీపీ వాసును మదివల పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఆ నిందితులిద్దరినీ బెయిల్‌పై వదిలేయాలని ఆదేశాలిచ్చినట్లు పలు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, బెయిల్ ఇవ్వడానికి సమయం పడుతుందని వాసు ఉన్నతాధికారికి చెప్పినట్లు తెలిసింది.

Recommended Video

Heavy Rains In Bengaluru, Continues For Next Few Days
ఏసీపీని బలిచేశారా?

ఏసీపీని బలిచేశారా?


కాగా, ఏసీపీ వాసు తనను రూ. 50 లక్షల లంచం అడిగినట్లు నిందితుల్లో ఒకడైన విశేష్ అడిషనల్ సీపీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. జనార్ధన్ అనే కానిస్టేబుల్ కు లంచం తీసుకునే బాధ్యతను అప్పగించాడని ఆరోపించాడు. ఈ క్రమంలో అడిషనల్ సీపీ మురుగన్ ఆదేశాల మేరకు ఏసీపీ వాసును సస్పెండ్ చేశారు. అయితే, ఏసీపీ వాసు నిందితులను విడుదల చేసేందుకు నిరాకరించడంతోనే అడిషనల్ సీపీ మురుగన్ ఆయనపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విచారణలో అసలు విషయం వెలుగుచూసే అవకాశం ఉంది.

English summary
A Bengaluru cop has been suspended for allegedly demanding Rs 50 lakh bribe in exchange for the release of two men, who were held while transporting 100 bottles of alcohol in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X