బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోర్డింగ్ రగడ: దిగొచ్చి క్షమాపణ చెప్పిన అమెజాన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్ణాటక రాజధాని బెంగుళూరులోని టిన్ ఫ్యాక్టరీ వద్ద ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్‌పై కేరళీయులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరులో పెట్టిన ఆ హోర్డింగ్‌కు కేరళీయులకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?

వివరాల్లోకి వెళితే... ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునే దిశలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున హోర్డింగ్‌లతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 'వుయ్ ఇండియన్స్ లవ్ హెల్పింగ్' అనే క్యాప్షన్‌తో ఓ బస్సును వెనక నుంచి కొందరు ప్రజలు నెడుతున్న పెద్ద ఫోటోను ముద్రించింది.

ఇలా ఈ ప్రకటనను దేశంలోని ప్రధాన పట్టణాలతో పాటు బెంగుళూరులోని పలు ప్రాంతాల్లో హార్డింగ్‌ల రూపంలో పెట్టింది. అమెజాన్ సంస్ధ రూపొందించిన ఈ ప్రకటనలోని బస్సు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థది కావడంతో అసలు సమస్య మొదలైంది.

Amazon sorry for ‘We Indians love helping’ ad

దీంతో ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తమ బస్సులు సరైన కండిషన్‌లో నడవడం లేదన్న సంకేతాలు వెలువరించేలా ఈ హోర్డింగులు ఉన్నాయని కేరళ వాసులు తీవ్రంగా మండిపడుతూ సోషల్ మీడియా వెబ్‌సైట్లలో అమెజాన్‌పై తిట్లదండకం అందుకున్నారు.

ఆ నాటా ఈ నాటా పడి చివరకు అసలు విషయం అమెజాన్‌కు చేరింది. దీంతో అమెజాన్ ఈ ప్రకటనపై తమను క్షమించాలని కోరుతూ బెంగుళూరుతో పాటు ప్రధాన నగరాల్లో పెద్దఎత్తున పెట్టిన ఆ హోర్డింగులన్నింటినీ తొలగిస్తామని చెప్పింది.

English summary
E-commerce giant Amazon.in faced strong criticisms on social media for its recent 'We Indians love to help' hoarding erected in Bengaluru. It featured a picture of a stalled Kerala State Road Transport Corporation (KSRTC) bus being pushed by a group of people with the caption 'We Indians love helping'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X