చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంకర్‌ను చంపిన గే లవర్స్: నలుగురి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Banker murdered
చెన్నై: తమిళనాడులోని వేలాచెరీలో గత గురువారం జరిగిన బ్యాంక్ అధికారి హత్య కేసు దర్యాప్తులో ఆశ్చర్యకమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ హత్యతో అసహజమైన లైంగిక సంబంధాలు, బ్లాక్‌మెయిల్, ప్రతీకారాలకు సంబంధం ఉన్నట్లు తేలింది. బీసంట్ నగర్ తమిళనాడు సహకార బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎన్ నాగరాజన్ హత్య కేసులో ఆదివారంనాడు పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు.

అరెస్టయిన నలుగురు కూడా మైనర్లని, విద్యార్థులని తేలింది. ఐదో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 20 ఏళ్ల గౌతం అనే ఇతను నుంగంబాకంలోని షోరూంలో పనిచేస్తాడు. తనతో సెక్స్ కోసం నాగరాజన్ తమకు డబ్బులు ఇచ్చాడని, అతని సంకెళ్ల నుంచి బయటపడడానికి ప్రయత్నించడంతో తమను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని, విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్తానని బెదిరించాడని నిందితులు చెప్పారు.

నాగరాజన్‌ను ఆ యువకులు 2008లో కలిశారు. అప్పుడు అతను బ్యాంక్ కాసిమేడు శాఖ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు వస్తుండడంతో వారు నాగరాజన్ కోరికను తీర్చడానికి సిద్ధపడ్డారు. నాగరాజన్ వారిని ఇంటికి పిలిచి, భోజనం పెట్టి తన పడకగదిలోకి తీసుకుని వెళ్లేవాడని పోలీసులు చెప్పారు. దాని పరిణామాలు తెలిసే వయస్సు కూడా వారికి లేదని అంటున్నారు.

యువకులను అక్టోబర్ 16వ తేదీన నాగరాజన్ తన ఇంటికి పిలిచాడు. అప్పుడే అతన్ని చంపాలని వారు నిర్ణయించుకున్నారు. పడకగదిలోకి వెళ్లిన తర్వాత వారిలో ఒకతను అతని తలపై కొట్టాడు. దాంతో అతను పడిపోయాడు. మరో ఇద్దరు చేతులతో అతని గొంతు నులిమారు. అతన్ని వారు విపరీతంగా కొట్టారు. అతని బెల్టు తీసి దానితో ఉరి వేశారు. గొంతు నులమడంతోనే అతను చనిపోయాడని అంటున్నారు.

ఆ సమయంలో 87 ఏళ్ల తల్లి కింది అంతస్థులోనే ఉంది. కానీ ఆమెకు అనుమానం రాలేదు. సంఘటన పై అంతస్థులో జరిగింది. హత్య చేసిన తర్వాత ముగ్గురు నాగరాజన్ సెల్‌ఫోన్, బంగారం రింగ్ తీసుకుని పెరుంగుడి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. మరో ఇద్దరు అతని స్కూటర్ తీసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. బుధవారం తెల్లవారు జామను సబర్బన్ రైలులో రోయాపురం వెళ్లారు. హత్య జరిగిన సమయంలో నాగరాజన్ భార్య సెల్వి అమెరికాలో ఉంది.

English summary
A probe into the murder of a 57-year-old bank official in Velachery last Thursday led investigators to a concoction of unnatural sex, blackmail and retribution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X