వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీపీడీ: పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడానికి కారణం ఇదేనా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బీపీడీ

''బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ) గురించి తెలుసుకున్నప్పుడు, నేను ఎప్పటికీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేనేమోనని అనిపించింది’’అని 21 ఏళ్ల మాయి భావించారు. ఆమెకు బీపీడీ ఉందని ఈ ఏడాది మొదట్లో వైద్యులు నిర్ధారించారు.

ఇలా బీపీడీ సోకినవారిలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా దీని గురించి మాట్లాడుతున్నారు.

#bpdisorder హ్యాష్‌టాగ్‌తో టిక్‌టాక్‌లో వీరు వీడియోలు చేస్తున్నారు. ఈ వీడియోల ద్వారా చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొంతమంది సరదాగా తమ కథలు చెబుతున్నారు.

అయితే, ఈ కథలన్నింటిలోనూ కనిపించే విషయాలు ఏమిటంటే ''హార్ట్‌బ్రేక్’’, ''టాక్సిక్ రిలేషన్‌షిప్స్’’.

సోషల్ మీడియాలో బీపీడీ గురించి మాట్లాడుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైందని ఎడిన్‌బరా యూనివర్సిటీ ప్రొఫెసర్, సైకియార్టిస్టు డాక్టర్ లియానా రొమానిక్ చెప్పారు. నేటి యువతలో దీనిపై అవగాహన పెరుగుతోందని ఆమె వివరించారు.

''నా దగ్గరకు వచ్చే కొంతమంది యువత 'నాకు బీపీడీ ఉందా?’అని అడుగుతుంటారు. అంటే దీనిపై వారికి అవగాహన ఉంది’’అని రొమానిక్ చెప్పారు.

బీపీడీ

ఏమిటీ బీపీడీ?

బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ).. అనేది ఒక మానసిక సమస్య. దీని వల్ల భావోద్వేగంగా నియంత్రణ కోల్పోతాం. ఫలితంగా మూడ్‌లపై నియంత్రణ ఉండదు. ప్రతి వంద మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

''బీపీడీ బాధితుల్లో చాలా మందికి బాల్యంలో బాధతోకూడిన అనుభవం లేదా నిర్లక్ష్యానికి గురికావడం లాంటివి జరిగి ఉంటాయి. దీని వల్ల పెద్దయ్యాక వీరు జీవిత భాగస్వాములతో సంతోషంగా జీవించడం కష్టం అవుతుంది’’అని రొమానిక్ చెప్పారు.

''ఇక్కడ బాధతోకూడిన అనుభవం అంటే ట్రామాగా చెప్పుకోవచ్చు. ఇది అన్నిసార్లూ భయానకంగా, వేధింపులను గురిచేసేలా ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు విడిపోవడం, ఒంటరిగా జీవించాల్సి రావడం లేదా చిన్నవయసులోనే తల్లి లేదా తండ్రిని కోల్పోవడం లాంటివి కూడా ఇక్కడ ప్రభావం చూపొచ్చు’’అని ఆమె వివరించారు.

అయితే, బీపీడీ విషయంలోనూ ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ''కొంతమంది బీపీడీకి చికిత్సలేదని లేదా వీరు ఇతరులను లోబరుచుకునే లేదా లొంగిపోయే అవకాశం ఉంటుందని గతంలో చెప్పేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. పరిస్థితులు మారుతున్నాయి’’అని ఆమె అన్నారు.

నేడు వైద్యుల్లోనూ దీనిపై చర్యలు జరుగుతున్నాయని రొమానిక్ చెప్పారు. దీన్ని పర్సనాలిటీ డిజార్డర్‌గా చూడాలా? లేదా ట్రామాకు స్పందనగా చూడాలా? అనే విషయంలో ఆ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

''పర్సనాలిటీ డిజార్డర్ అనే పదాన్ని ఉపయోగించడానికి నాకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఇది ఒక వ్యక్తిని గుండెలో కత్తితో పొడవడమే. అంటే ఆ మనిషి వ్యక్తిత్వంలోనే తప్పుందని చెప్పడం. నిజానికి సమస్య అది కాదు. వీరు ఎన్నో దాటుకుని ముందుకు వచ్చారు, జీవితంలో వారు ఎన్నో చూశారు.. ఆ విషయాన్ని మనం గుర్తించాలి’’అని ఆమె చెప్పారు.

బీపీడీ

పీకల్లోతు ప్రేమలోకి

మాయి తన రిలేషన్‌షిప్‌ విషయంలో ఆందోళనతో ఉండేవారు. తను పూర్తిగా జీవిత భాగస్వామిపై ఆధార పడిపోతున్నానని, పీకల్లోతుల్లో కూరుకుపోతున్నానని ఆమె భావించేవారు. అప్పుడే బీపీడీ గురించి ఆమె పరిశోధన తెలుసుకోవడం మొదలుపెట్టారు.

''నేను రిలేషన్‌షిప్‌లో ఉండేటప్పుడు బీపీడీ లక్షణాలు నాలో కొట్టొచ్చినట్లు కనిపించేవి’’అని ఆమె చెప్పారు. మార్చి 2021లో ఆమెకు బీపీడీ ఉందని వైద్యులు నిర్ధారించారు.

''చాలాకొద్ది సమయంలోనే నేను పీకల్లోతు 'ప్రేమ’లో కూరుకుపోయేదాన్ని. అవతలి వ్యక్తి నుంచి కాల్ లేదా టెక్స్ట్ కోసం ఎదురుచూసేదాన్ని. మిగతా స్నేహితులను దూరం పెట్టేదాన్ని. అసలు పనులన్నీ పక్కన పెట్టేసి.. తన కోసమే బతుకుతున్నట్లుగా అనిపించేది’’అని ఆమె చెప్పారు.

''ఒకసారి నేను స్నేహితురాలి అపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. అప్పుడే బాయ్‌ఫ్రెండ్ నుంచి నాకు టెక్స్ట్ వచ్చింది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ 15 నిమిషాల్లో అతడి అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయా’’అని ఆమె వివరించారు.

బీపీడీ

పానిక్ అటాక్

''ఒక పానిక్ అటాక్ వచ్చినట్లు అనిపించింది. మొత్తానికి అక్కడికి నేను సురక్షితంగానే చేరుకున్నాను. ఆ తర్వాత మళ్లీ స్నేహితురాలి దగ్గరకు వెళ్లాను. ఎందుకంటే ఆమెతో చాలా చెత్తగా ప్రవర్తించాను. అందుకే ఆమెతో కాసేపు కూర్చొని మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టాలని అనుకున్నాను’’అని మాయి చెప్పారు.

కొన్నిసార్లు తమను వదిలిపెట్టేస్తారనే భయమే పూర్తి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ''నా చివరి రిలేషన్‌షిప్‌లో చివరి కొన్ని వారాలు పదేపదే అతడికి నేను నిన్న వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పేదాన్ని. ఆ తర్వాత చివగా అతడు ఇక చాలని చెప్పాడు. అప్పుడు నిజంగా నా కాళ్ల కింద నేల కంపించినట్లు అనిపించింది. ఏడ్చాను, మనం కలిసి ఉందామని ప్రాథేయపడ్డాను. ఈ రిలేషన్‌షిప్ దెబ్బతినడానికి నా బీపీడీనే కారణం’’అని ఆమె వివరించారు.

బీపీడీ ఉందని తెలిసిన తర్వాత, డయాలెక్టికల్ బిహేవియర్ థెరపీ (డీబీటీ) చికిత్సను మాయికి వైద్యులు సూచించారు. భావోద్వేగాలు నియంత్రణలో పెట్టుకోవడానికి ఇది తోడ్పడుతుంది. మరోవైపు ఆమె యాంటీ డిప్రసెంట్లు కూడా తీసుకోవడం మొదలుపెట్టారు.

''నాకు కాస్త పాజిటివ్‌గా అనిపించడం మొదలైంది’’అని ఆమె చెప్పారు. ''మొదటిసారి బీపీడీ ఉందని తెలిసినప్పుడు.. మరణ శిక్ష విధించినట్లుగా అనిపించింది. జీవితాంతం ఈ భారాన్ని మోయాలేమో అని అనుకున్నాను’’అని ఆమె చెప్పారు.

ఇక్కడ బీపీడీతో ఉండే అందరూ ఒకేలా ప్రవర్తించరని డాక్టర్ రొమానిక్ చెప్పారు. ''మూడు లేఖలను చదివి అందరి మీదా మనం ఒక అవగాహనకు వచ్చేయకూడదు’’అని ఆమె వివరించారు.

ఇవి బీపీడీ లక్షణాలా?

బీపీడీ బాధితులతో కలిసి జీవించడం వారి జీవిత భాగస్వాములకు కష్టంగా ఉంటుందని రొమానిక్ చెప్పారు. అయితే, ఆరోగ్యంగా, సంతోషంగా జీవిస్తున్న కేసులు కూడా తాను చూశానని ఆమె వివరించారు.

32 ఏళ్ల ఎలెన్‌ ఇటీవల బీపీడీ బాధితుడితో కలిసి జీవించారు. అతడికి గత ఏడాది వైద్యులు బీపీడీ నిర్ధారించారు. ''అతడికి బీపీడీ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేను. అతడిలో కనిపించే అవేశపూరిత ప్రవర్తనకు ఇదే కారణమని సర్దిచెప్పుకునేదాన్ని. ఎందుకంటే ఇది బీపీడీలో భాగమని నేను అనుకునేదాన్ని’’అని ఎలెన్ చెప్పారు.

''ఇంటిలో అతడు ఒంటరిగా గడపడానికి నేనే కారణమని ఆయన నమ్మేలా చేసేవాడు. దీంతో ఆఫీసు నుంచి కాస్త త్వరగా రావడం మొదలుపెట్టాను. ఏదైనా విషయంలో మాకు బేధాభిప్రాయాలు ఉంటే.. అతడు మౌనంగా ఉండిపోయేవాడు. దీంతో అతడికి బీపీడీ ఉందనే నేనే సర్దిచెప్పుకునేదాన్ని. ఒక్కోసారి అతడు రాత్రి మధ్యలో లేచి వెళ్లిపోయేవాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి నిన్ను చాలా ప్రేమిస్తున్నానని చెప్పేవాడు’’అని ఆమె వివరించారు.

ఆయన ప్రవర్తన కొన్నిసార్లు వేధింపులకు గురిచేలా ఉండేది. అయితే, బీపీడీ బాధితులు అందరూ ఇలానే ఉంటారని అనుకోవడం సబబేనా?

వారు కూడా మనుషులే

ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అని అంటారు రొమానిక్. ''ఎందుకంటే వారు కూడా మనుషులే. బీపీడీ ఉన్నంత మాత్రాన వారిని దూరం పెట్టడం ఏమిటి? బహుశా వారు కొంత భిన్నంగా స్పందిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ చాలాసార్లు ఆ ప్రవర్తన మనల్ని లోబరుచుకునేలా ఉండదు. బహుశా కొన్నిసార్లు ఉండొచ్చు’’అని ఆమె చెప్పారు.

ముఖ్యంగా తమను వదిలిపెట్టేస్తారనే భయం వల్లే వారు అలా ప్రవర్తిస్తుంటారని రొమానిక్ చెప్పారు. ''నేను బీపీడీ బాధితుల నుంచి అర్థం చేసుకున్నది ఏమిటంటే.. ఎదుటివారు కొట్టకముందే, వారే కొట్టాలని భావిస్తారు. ఆ రిలేషన్‌షిప్‌ ముగింపుకు వచ్చిందనే సంకేతాలు మీరు ఇవ్వొచ్చు లేదా మీ పార్ట్‌నర్‌ను మీరు పరీక్షించాలని అనుకోవచ్చు.. అదే చివరగా అటువైపు నుంచి అన్నింటికీ సిద్ధంగా ఉండాలని బీపీడీ బాధితులు భావిస్తారు. దీంతో వారి నోటి నుంచే ముందుగా విడిపోవాలనే మాట వస్తుంది’’అని ఆమె చెప్పారు.

''నిజానికి బీపీడీ పార్ట్‌నర్స్‌తో మనం మనసు విప్పి మాట్లాడాలి. ఇక్కడ జంటలో ఒకరికి బీపీడీ ఉంటే, రెండో వ్యక్తిపై కూడా ఆ ప్రభావం పడుతుంది’’అని ఆమె చెప్పారు.

ఒక్కో బీపీడీ వ్యక్తి ఒక్కోలా ప్రవర్తిస్తారని ఆమె చెప్పారు. వీరు ఇలానే ప్రవర్తిస్తారని చెప్పడం చాలా కష్టమని వివరించారు. ''చాలా మంది బీపీడీ బాధితులు.. ఎంతో ప్రేమగా మాట్లాడతారు, చకచకా పనిచేస్తారు, ఎంతో ఆసక్తికరంగా జీవిస్తారు’’అని ఆమె తెలిపారు.

(నోట్: బాధితుల పేర్లు మార్చాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
BPD: Is this the reason for youth falls in deep love?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X