వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులను డిసెంబర్ 30న మరోమారు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం .. ఈ సారైనా చర్చలు ఫలిస్తాయా ? సర్వత్రా ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులను రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నెల రోజులకు పైగా రైతుల పోరాటం ఆగకుండా సాగుతోంది. తమ డిమాండ్ల విషయంలో రైతులు ఏ మాత్రం తగ్గకుండా పోరాటం సాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే వెనుదిరిగి వెళ్తాం అంటూ పదే పదే రైతులు ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నారు.

31 వ రోజుకు రైతుల ఆందోళన: కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం, ఈ నెల 29న మరో దఫా చర్చలు31 వ రోజుకు రైతుల ఆందోళన: కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం, ఈ నెల 29న మరో దఫా చర్చలు

 ముప్పై మూడు రోజులుగా పట్టువదలని విక్రమార్కుల్లా రైతుల పోరాటం

ముప్పై మూడు రోజులుగా పట్టువదలని విక్రమార్కుల్లా రైతుల పోరాటం

ముప్పై మూడు రోజులుగా పట్టువదలని విక్రమార్కుల్లా రైతులు పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటివరకు కేంద్రంతో ఐదు దఫాలుగా చర్చలు జరిగినా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇక ఇటీవల కేంద్రం పంపిన ఆహ్వానం మేరకు రైతులు రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు సిద్ధం కాగా, ప్రభుత్వం వారిని 30వ తేదీన బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు చర్చలకు రావలసిందిగా ఆహ్వానించింది. ఇప్పటికే తమ అజెండాను ప్రభుత్వానికి పంపిన రైతులు ప్రభుత్వం చర్చలకు రమ్మని ఆహ్వానించి, ఎటూ తేల్చక పోవడంతో సందిగ్ధంలో చిక్కుకున్నారు .

 మళ్లీ డిసెంబర్ 30వ తేదీన చర్చలు.. చర్చలు ఫలిస్తాయా ?

మళ్లీ డిసెంబర్ 30వ తేదీన చర్చలు.. చర్చలు ఫలిస్తాయా ?

ఇక తాజాగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్చలకు మరోమారు రైతులను ఆహ్వానించింది. రైతులతో చర్చలపై ఓపెన్ మైండ్ తో ఉన్నామని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ప్రభుత్వం ఉందని ఈ మేరకు పేర్కొంది. ఇప్పటికే ఐదు మార్లు రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కాగా, తాజాగా మళ్లీ డిసెంబర్ 30వ తేదీన చర్చలు జరగనున్న నేపథ్యంలో, ఈసారైనా చర్చల్లో పురోగతి కనిపిస్తుందా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.

 రైతుల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ , ప్రియాంకా గాంధీ డిమాండ్

రైతుల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ , ప్రియాంకా గాంధీ డిమాండ్

మరో పక్క రైతులు ఆందోళనకు మద్దతుగా ప్రతిపక్షాలు రైతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి .తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రైతులను ఉద్దేశించి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. రైతులను ఉద్దేశించి బిజెపి ప్రభుత్వం ఉపయోగిస్తున్న పదజాలం అభ్యంతరకరంగా ఆమె పేర్కొన్నారు . కేంద్ర ప్రభుత్వం రైతుల ఆవేదన ని వినాలని డిమాండ్ చేసిన ప్రియాంక గాంధీ, ప్రభుత్వం వారి ఆందోళనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్ధించే నాయకులను గ్రామాల్లోకి అనుమతించవద్దు అంటూ యూపీ కి చెందిన ఎస్పీ నేత రామ్ గోవింద్ చౌదరి కూడా పిలుపునిచ్చారు.

ఘాటైన అందాలతో హీరోయిన్ వేదిక.. మీరు ఎప్పుడూ చూడని హాట్ ఫోటోలు

English summary
The government has recently invited farmers once again for talks to resolve their problems on December 30 at 2 pm.. To this extent we are with an open mind on negotiations with the farmers and the government is positive to resolve the issues. While the government has already failed to negotiate with the farmers five times, it is still an elusive question as to whether there will be any progress in the talks now that talks are set to resume on December 30 at 2 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X