వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపఎన్నిక: చెంగన్నూర్‌లో సీపీఎం అభ్యర్థి సాజి విజయం, ‘నేనంటే ఇంత ఇష్టమా?’

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని చెంగనూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఎల్డీఎఫ్ పార్టీ అభ్యర్థి సాజి చెరియన్ ఘన విజయం సాధించారు. సుమారు 20,956ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి విజయకుమార్‌కు 45,610ఓట్లు వచ్చాయి.

చెంగనూర్ విజయం పట్ల సాజి చెరియన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంత భారీ విజయాన్ని ఊహించలేదన్నారు. ప్రజలు ఇంతగా ఇష్టపడుతున్నారన్న విషయం తనకు తెలియదని అన్నారు.

CPM wins Keralas Chengannur Assembly seat

కాగా, ఎల్డీఎఫ్ పార్టీ విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. యూడీఎఫ్, బీజేపీ కేంద్ర బిందువైన చెంగనూర్‌లో.. ఎల్డీఎఫ్ సీటు గెలవడం శుభసంకేతమని సీపీఎం వర్గాలు భావిస్తున్నాయి.

అలప్పుజా కార్యదర్శిగా ఉన్న సాజి చెరియన్‌కు సుమారు 65,135ఓట్లు పడ్డాయి. స్థానికంగా ఓటర్లను ఆకర్షించడంలో విఫలమైనట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ్ కుమార్ చెప్పారు. కాగా, బీజేపీ అభ్యర్థి మూడోస్థానానికే పరిమతమయ్యారు. చెంగన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్న కేకే రామచంద్రన్ నాయర్(సీపీఎం) కాలేయ వ్యాధితో ఈ ఏడాది జనవరిలో మరణించడంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి.

English summary
Its once-traditional constituency in Kerala eluded the Congress again, as the CPM regained the Chengannur seat today following Monday's assembly bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X