బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల విధులకు డుమ్మా, 1,500 అధికారుల మీద ఎఫ్ఐఆర్, బీజేపీ, కాంగ్రెస్ మీద కేసులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి ఎన్నికల కమిషన్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు హాజరుకాని 1,500 మంది అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సోమవారం బెంగళూరు జిల్లా ఎన్నికల అధికారి మంజునాథ్ ప్రసాద్ చెప్పారు.

అధికారులకు శిక్షణ

అధికారులకు శిక్షణ

మే 5వ తేదీ మరోసారి ఎన్నికల సంఘం శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తోందని, ఆరోజు హాజరు అయ్యే అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోమని ఎన్నికల అధికారి మంజునాథ్ ప్రసాద్ వివరించారు. పోలింగ్, కౌంటింగ్ సవ్యంగా జరగడానికి ఎన్నికల కమిషన్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసిందని మంజునాథ్ ప్రసాద్ వివరించారు.

బెంగళూరులో 91.13 లక్షల ఓటర్లు

బెంగళూరులో 91.13 లక్షల ఓటర్లు

జనవరి 23 నుంచి ఏప్రిల్ 17వ వరకూ 4.39 లక్షల మంది కొత్త ఓటరు జాబితాలో వారి పేర్లు నమోదు చేసుకున్నారని ఎన్నికల అధికారి మంజునాథ్ ప్రసాద్ చెప్పారు. బెంగళూరు నగరంలో మొత్తం 91.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారని అన్నారు.

రూ. 5.85 కోట్లు సీజ్

రూ. 5.85 కోట్లు సీజ్

సరైన ప్రతాలు లేని రూ. 5.85 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల అధికారి మంజునాథ్ ప్రసాద్ వివరించారు. బీజేపీకి చెందిన 2,162, కాంగ్రెస్ కు చెందిన 1,008, ఎంఇపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన 603 బండిల్స్ స్వాధీనం చూసుకున్నామని మంజునాథ్ ప్రసాద్ చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ మీద కేసులు

బీజేపీ, కాంగ్రెస్ మీద కేసులు

బీజేపీ మీద 6, కాంగ్రెస్ పార్టీ మీద మూడు, ఇతర పార్టీల మీద 25 కేసులు నమోదు చేశామని మంజునాథ్ ప్రసాద్ చెప్పారు. పోలింగ్ జరిగే 48 గంటల ముందు, కౌంటింగ్ జరిగే 48 గంటల ముందు మద్య నిషేదం అమలులో ఉంటుందని బెంగళూరు జిల్లా ఎన్నికల అధికారి మంజునాథ్ ప్రసాద్ వివరించారు.

English summary
Election commission has warned that the commission will book case against officials who have skipped election duty and training in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X