వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ దిమ్మ తిరిగింది: నోటీసులు ఇచ్చిన ఎన్నికల కమిషన్

తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని ఆశపడుతున్న అన్నాడీఎంకే పార్టీ చీఫ్ శశికళకు దిమ్మతిరిగింది. మిమ్మల్ని అన్నాడీఎంకే చీఫ్ గా ఎవరు నియమించారు ? అంటూ చెప్పాలని భారత ఎన్నికల కమిషన్ శనివారం నోటీసులు.

|
Google Oneindia TeluguNews

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని ఆశపడుతున్న అన్నాడీఎంకే పార్టీ చీఫ్ శశికళకు దిమ్మతిరిగింది. మిమ్మల్ని అన్నాడీఎంకే చీఫ్ గా ఎవరు నియమించారు ? అంటూ చెప్పాలని భారత ఎన్నికల కమిషన్ శనివారం నోటీసులు జారీ చేసింది.

శశికళ సమాధానం ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ గడుపు ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీలో ఓ పదవిలో ఉండాలంటే కనీసం ఐదేళ్లు ఆ పార్టీలో సభ్యుత్వం ఉండాలని, శశికళ పార్టీ సభ్యత్వం తీసుకుని ఐదేళ్లు పూర్తి కాలేదని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

తమిళనాడు సీఎంగా శశికళ: ఫిబ్రవరి 6 ముహూర్తం ! పన్నీర్ ?తమిళనాడు సీఎంగా శశికళ: ఫిబ్రవరి 6 ముహూర్తం ! పన్నీర్ ?

2011లో జయలలిత శశికళను పార్టీ సభ్వతం నుంచి తప్పించారని శశికళ పుష్ప ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చారు. అన్నాడీఎంకే చీఫ్ గా పని చెయ్యడానికి శశికళ నటరాజన్ కు ఎలాంటి అర్హత లేదని శశికళ పుష్ప ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు.

Election Commission of India sent notice to Sasikala who appointed as General Secretary of ADMK.

2016 డిసెంబర్ 30వ తేదిన అన్నాడీఎంకే పార్టీ నాయకులు సమావేశం అయ్యి శశికళను పార్టీ చీఫ్ గా ఎన్నుకున్నారు. ఆమెను పార్టీ చీఫ్ గా నియమించామని తమిళ్ లో ఉన్న ఓ లేటర్ ను ఎన్నికల కమిషన్ కు పంపించారు. అయితే శశికళ నియామకం చెల్లదని శశికళ పుష్ప ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు.

పన్నీర్ కు కన్నీరే మిగిలింది: రహస్య సమావేశం, ఇప్పుడు ఏం చేద్దాం?పన్నీర్ కు కన్నీరే మిగిలింది: రహస్య సమావేశం, ఇప్పుడు ఏం చేద్దాం?

అన్నాడీఎంకే పార్టీ నియమావళి ప్రకారం పార్టీలోని సర్వసభ్య సమావేశం నిర్వహించి అందరూ కలిసి పార్టీ చీఫ్ ను ఎన్నుకోవాలని, నాయకులు మాత్రమే కాదని ఎన్నికల కమిషన్ గుర్తు చేస్తూ శశికళ నటరాజన్ కు నోటీసులు జారీ చేసింది. సరైన సమాధానం ఇవ్వాలని నోటీసులో సూచించింది.

ఇప్పుడు అన్నాడీఎంకే నాయకులు ఏం చెయ్యాలి ? అని ఆలోచిస్తున్నారు. న్యాయనిపుణలుతో చర్చలు మొదలు పెట్టారు. మొత్తం మీద రెండు మూడు రోజుల్లో సీఎం కుర్చిలో కుర్చోవాలని ఆశపడుతున్న శశికళకు ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడంతో అన్నాడీఎంకే నాయకులు షాక్ కు గురైనారు.

English summary
Election Commission of India sent notice to VK Sasikala Natarajan who appointed as General Secretary of AIADMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X