• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొడుకు భార్యతో రాసలీలలు - కుటుంబానికి మత్తుమందు - మామకోడలు జంప్ - సీసీటీవీలో..

|

మిగతా ఇళ్లలో అత్తాకోడలి పోరుకు భిన్నంగా ఆ ఇంట్లో మాత్రం మామాకోడళ్లు నిత్యం గొడవ పడేవాళ్లు.. ప్రతి చిన్న విషయానికి నువ్వెంత అంటే నువ్వెంత అని వాగ్వాదానికి దిగేవాళ్లు.. కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాత్రం వావివరుసలు మరిచి సుఖాలు అనుభవించేవాళ్లు.. ఆ విధంగా మిగతా ఇంటి సభ్యులందరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా చాలా కాలంపాటు పనికానిచ్చేవాళ్లు.. ఒకరినొకరు విడిచి క్షణమైనా ఉడలేని స్థితిలో చివరికి ఆ మామకోడళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయారు. హర్యానాలోని పానిపట్ లో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై పోలీసులు, కుటుంబీకులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

సుమేధా మృతి ఘటనలో సంచలనం - నేరపూరిత హత్య - మంత్రి కేటీఆర్‌పై పాప తల్లిదండ్రుల ఫిర్యాదు

కొడుకు భార్యపై కన్నేసి..

కొడుకు భార్యపై కన్నేసి..

పానిపట్ లోని సోని కాలనీకి చెందిన సలీమ్ అనే వ్యక్తికి చిన్నవయసులోనే పెళ్లైంది. అతను మధ్యవయసుకు వచ్చేనాటికే పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. కొడుకులతో కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగించేవాడు. చిన్నకొడుకు అబ్దుల్ కు నాలుగేళ్ల కిందట ఆస్మా అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఆ జంటకు మూడేళ్ల కూతురు, 10 నెలల బాబు ఉన్నారు. వావివరుసలు మరిచి, కొడుకు భార్యపై కన్నేసిన సలీం.. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కూతురిలా చూసుకోవాల్సిన కొడుకు భార్యతో కామకోరికలు తీర్చుకుంటున్న మామ బాగోతం తాజాగా బయటపడింది.

బద్ధ శత్రువుల్లా బిల్డప్..

బద్ధ శత్రువుల్లా బిల్డప్..

కోడలు ఆస్మా, మామ సలీం రహస్యంగా అక్రమసంబంధం నెరపుతూ, పైకి మాత్రం బద్ధ శత్రువుల్లా బిల్డప్ ఇచ్చేవాళ్లు. మిగతా కుటుంబీకులకు అనుమానం రాకుండా నిత్యం తగువులాడుకునేవారు. తమ బంధానికి కుటుంబం అడ్డుగా ఉందని భావించిన ఆ ఇద్దరూ ఏకంగా ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పక్కాగా ప్లాన్ చేసి.. కోడలు తన పది నెలల బిడ్డతో సహా మామతో వెళ్లిపోయింది.

భోజనంలో మత్తుమందు కలిపి..

భోజనంలో మత్తుమందు కలిపి..

ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్న మామకోడళ్లు.. తమ పథకం ప్రకారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి మిగతా కుటుంబీకులు గాఢనిద్రలోకి జారుకునేలా చేశారు. అనంతరం పది నెలల బాబును తీసుకుని వెళ్లిపోయారు. పొద్దునే నిద్రలేచాక మామాకోడలు కనిపించకపోవడంతో కుటుంబీకులు కంగారుపడ్డారు. తెలిసినవాళ్లకు ఫోన్లు చేసి ఎక్కడా లేరని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించారు.

సీసీటీవీ ఫుటేజీతో గుట్టురట్టు..

సీసీటీవీ ఫుటేజీతో గుట్టురట్టు..

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా సలీం ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో మామకోడళ్లు కలిసి వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. లోతైన దర్యాప్తులో.. ఆ ఇద్దరూ ఇష్టపూర్తిగానే ఇల్లు వదిలి వెళ్లినట్లు తేలింది. కన్న తండ్రే ఇంతటి ఘాతుకానికి పాల్పడటాన్ని కొడుకు అబ్దుల్ జీర్ణించుకోలేకపోయాడు. బయటికి వెళ్లడానికి ముఖం చాలట్లేదని, వాళ్లిద్దరూ కుటుంబ పరువు బజారున పడేశారని అబ్దుల్ ఆవేదన చెందాడు. పారిపోయిన మామకోడళ్ల కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.

ఆందోళనల వేళ, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన - కీలక అంశాలివే - వీలైతే ప్రధాని మోదీతోనూ భేటీ

English summary
in a shameful incident, a man allegedly eloped with his son's wife in panipat's soni colony of haryana. the incident came to light after the cctv footage of them running away in the night was revealed. till then family members were unaware about them. they reportedly added sedatives in the food of the family members due to which everybody became unconscious before escape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X