చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై పేలుళ్లు: టైమర్, మొబైల్‌తో పేల్చారు. (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో బెంగళూర్ - గౌహతి ఎక్స్‌ప్రెస్ రైల్లో బాబు పేలుళ్ల సంఘటన తీవ్ర సంచనలం సృష్టించింది. పేలుళ్లు రైలులోని ఎస్4, ఎస్5 అనే రెండు బోగీల్లో సంభవించాయి. ఆ ఘటనలో ఒకరు మరణించగా, గాయపడినవారి సంఖ్య 14కు చేరినట్లు సమాచారం. ఘటనా స్థలం వద్ద జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఎ) దర్యాప్తు చేపట్టింది.

సంఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. బాంబులు పేల్చడానికి మొబైల్ వాడినట్లు అనుమానిస్తున్నారు. టైమర్ కూడా అమర్చారని అంటున్నారు. బాంబు తయారీకి ఆర్డిఎక్స్ వాడినట్లు తెలుస్తోంది.

మంగళవారం నుంచి రైలులో దాగి ఉన్న అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మరో వ్యక్తిని రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాంబును సీటు కింద రెండు నల్లటి సంచుల్లో పెట్టారు. చెన్నైని లక్ష్యం చేసుకున్నారా, మరేదైనా సిటీని లక్ష్యం చేసుకున్నారా అనేది తెలియడం లేదు.

చెన్నై పేలుళ్లు

చెన్నై పేలుళ్లు

బెంగళూర్ - గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటన గురువారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో జరిగింది.

చెన్నై పేలుళ్లు

చెన్నై పేలుళ్లు

స్టేషన్ నుంచి బయలుదేరడానికి ముందు ఆగిన రైలులో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు.

చెన్నై పేలుళ్లు

చెన్నై పేలుళ్లు

గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుళ్లు సంభవించడంతో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఓ అనుమానితుడు రైలులో దాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

చెన్నై పేలుళ్లు

చెన్నై పేలుళ్లు

రైల్వే పోలీసులు కేసు నమోదు చేశఆరు. దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి లేదా సిఐడికి అప్పగించనున్నట్లు సమాచారం.

చెన్నైలో పేలుళ్లు

చెన్నైలో పేలుళ్లు

సంఘటన జరిగిన వెంటనే ఎన్ఐఎ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో మునిగిపోయింది.

చెన్నైలో పేలుళ్లు

చెన్నైలో పేలుళ్లు

బాంబులను సీటు కింద నల్లటి సంచుల్లో పెట్టారు. వాటిని చెన్నై నగరంలో పేల్చాలని అనుకున్నారా, లేదా అనేది తెలియడం లేదు.

English summary
Twin explosions took place in the Bangalore-Guwahati Express on Platform 9 of the Chennai Central Railway station at 7:15 am. The explosion took place in two bogies S4 and S5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X