నందిగ్రామ్‌లో ఓటమి ఖరారు, మరో స్థానంలో మమతా బెనర్జీ నామినేషన్? -ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ లోనూ ఓటింగ్ శాతం భారీగా నమోదైంది. గురువారం నాటి రెండో దశలో సాయంత్రం ఐదు గంటల వరకు 72.25 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఇది టీఎంసీ పాలనపై ప్రజలకు ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని, మమతా బెనర్జీని ఇంటికి పంపేయాలని బెంగాలీలు డిసైడైపోయారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతిష్టాత్మక నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంపైనా ప్రధాని సంచలనల కామెంట్లు చేశారు..

బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలవడంతో ఈసారి నందిగ్రామ్ సీటుపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒకప్పటి మమత అనుచరుడు, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు. రెండోదశలో భాగంగా గురువారం అక్కడ పోలింగ్ జరిగింది. అదే సమయంలో ఉలుబేరియా జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ దీదీపై మోదీ సెటైర్లు వేశారు..

Nandigram paving way for renaissance, is Didi seeking another seat, says pm modi in Uluberia rally

నందిగ్రామ్ లో మమత ఓటమి ఖరారైపోయిందని, ఒక్క నందిగ్రామ్ స్థానం నుంచే కాకుండా మమతను ఇంటికి పంపేయాలని యావత్ బెంగాల్ నిర్ణయించుకుందని ప్రధాని అన్నారు. నందిగ్రామ్ లో ఓడిపోబోతున్న మమత మరో స్థానంలో నామినేషన్ వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోందనీ మోదీ చెప్పారు.

''దీదీ.. నేను విన్నది నిజమేనా? మరో నియోజకవర్గం నుంచి కూడా మీరు నామినేషన్ వేస్తున్నారట కదా! నందిగ్రామ్ లో మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మరో చోటుకి వెళ్లాలనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా సరే, ఒకే రీతిలో సమాధానం చెప్పడానికి బెంగాలీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు'' అని మోదీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్ ప్రజలు ఈరోజు తమ కలను సాకారం చేసుకున్నారని, ఇవాళ జరిగింది కేవలం ఓటింగ్ మాత్రమే కాదు.. బెంగాల్ పునరుజ్జీవానికి మార్గం పడిందని మోదీ అన్నారు.

ప్రధానినైన తనను బయటి వ్యక్తిగా, టూరిస్టుగా మమత అభివర్ణించడాన్ని గుర్తుచేస్తూ... చొరబాటుదారులను సొంత బిడ్డలుగా చూసే దీదీ.. భారతమాత బిడ్డనైన నన్ను బయటి వ్యక్తి అనడం సబబేనా? ప్రజల్ని ఇలా విడదీయడం కరెక్టేనా? ఇది రాజ్యాంగ నియమావళికి విరుద్ధం కాదా? అని మోదీ నిలదీశారు. బెంగాల్ రెండో దశలోనూ భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+