వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వానికి రూ. 200, పబ్లిక్‌కు రూ. 1000: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర వివరాలివే: పూనావాలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కరోనా వ్యాక్సిన్ ధర గురించిన కీలక ప్రకటన చేశారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ ఒక డోసును ప్రభుత్వానికి రూ. 200లకు, ప్రజలకు రూ. 1000 చొప్పున విక్రయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేషనల్ డ్రగ్ రెగ్యూలేటర్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు భారతదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.

దేశ వ్యాప్తంగా నేడే కరోనా వ్యాక్సిన్ డ్రైరన్: పూర్తి వివరాలివే, ఏపీలో 13, తెలంగాణలో రెండు జిల్లాల్లోదేశ వ్యాప్తంగా నేడే కరోనా వ్యాక్సిన్ డ్రైరన్: పూర్తి వివరాలివే, ఏపీలో 13, తెలంగాణలో రెండు జిల్లాల్లో

నెలకు 50-60 మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి..

నెలకు 50-60 మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి..

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికాలతో కలిసి సంయుక్తంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు పూనావాలా తెలిపారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని, కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
తమ సంస్థ నెలకు 50 నుంచి 60 మిలియన్ల ఆస్ట్రాజెనికా/ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయగలదని చెప్పారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ సులభం..

కోవిషీల్డ్ వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ సులభం..

అంతేగాక, కోవిషీల్డ్.. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ల కంటే కూడా సులభంగా నిల్వ చేసుకోవచ్చని, రవాణాకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందని అదర్ పూనావాలా తెలిపారు. ప్రభుత్వంతో ఒప్పందం గురించి వేచి చూస్తున్నామని, తమ వ్యాక్సిన్ వచ్చే పది రోజుల్లో మార్కెట్లోకి వస్తుందని వివరించారు.

నిమిషానికి 5వేల డోసుల ఉత్పత్తి.. విదేశాలకు కూడా ఎగుమతి

నిమిషానికి 5వేల డోసుల ఉత్పత్తి.. విదేశాలకు కూడా ఎగుమతి

సీరమ్ ఇనిస్టిట్యూట్ నిమిషానికి 5,000 డోసులను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగిందని పూనావాలా తెలిపారు. ఇప్పటికే 40-50 మిలియన్ల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతేగాక, తాము బంగ్లాదేశ్, సౌదీ అరేబియా తోపాటు 66 ఇతర దేశాలతో వ్యాక్సిన్ ఎగుమతికి ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ఎగుమతిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి

కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి

కాగా, కోవిషీల్డ్ తోపాటు హైదరాబాద్‌కు ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. డీసీజీఐ ఈ వ్యాక్సిన్‌కు అనుమతిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ టీకా భద్రతమైందని ఇప్పటికే నిరూపితమైందని పేర్కొంది. ఐసీఎంఆర్, పుణె ఎన్ఐవీ సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రెండు వ్యాక్సిన్లు కూడా మరికొద్ది రోజుల్లో వినియోగంలోకి రానున్నాయి.

English summary
The Oxford vaccine will be sold for Rs 200 per dose to the government while it will be available for Rs 1,000 for the general public, Adar Poonawalla, chief executive of Serum Institute of India, was quoted as saying by a TV channel on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X