బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డుపై సిగరేట్ తాగొద్దంటే టెక్కిని చంపేశారు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సిగరేట్ తాగద్దు అని బుద్దిమాటలు చెప్పిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును అతి దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఇక్కడి రామమూర్తి నగరలో శశాంక్ (25) అనే యువకుడిని హత్య చేశారు.

శశాంక్ బెంగళూరు నగరంలోని ప్రయివేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి రామమూర్తినగరలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం కారులో తన ఇంటికి బయలుదేరాడు.

మార్గం మద్యలో ఒక షాప్ దగ్గర శశాంక్ కారు నిలిపాడు. తరువాత షాప్ దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో షాప్ దగ్గర రోడ్డు మీద డ్యానియల్, అజయ్, వాసుదేవ్ తదితర యువకులు సిగరేట్లు తాగుతున్నారు. వారిని గమనించిన శశాంక్ సిగరేట్లు తాగితే ఆరోగ్యం పాడవుతుందని చెప్పాడు.

 software engineer Shashank was stabbed to death by group of youths

రోడ్ల మీద సిగరేట్లు తాగరాదని బుద్ది మాటలు చెప్పాడు. ఆ సందర్బంలో సహనం కొల్పోయిన యువకులు కత్తులు తీసుకుని శశాంక్ ను ఇష్టం వచ్చినట్లు పోడిచారు. తీవ్రగాయాలైన శశాంక్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే శశాంక్ మరణించాడని వైద్యులు దృవీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వాసుదేవ్, అజయ్ లను అరెస్టు చేశారు. పరారైన ప్రధాన నిందితుడు డ్యానియల్ కోసం గాలిస్తున్నామని రామమూర్తి నగర పోలీసులు తెలిపారు.

English summary
software engineer Shashank (25) was stabbed to death by group of youths in Ramamurthy Nagar police station limits, Bengaluru on Monday morning. Shashank advised the youths not to smoke cigarette, for this they killed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X