టార్చర్: ఫ్రెండ్ తో కలిసి కన్న తండ్రిని దారుణంగా చంపేసిన కొడుకు, 24 గంటల్లో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కన్న తండ్రిని కుమారుడు స్నేహితుడితో కలిసి అతిదారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగరలోని బంగారప్ప గుడ్డలో నివాసం ఉంటున్న కాంతరాజు (50) అనే వ్యక్తి హత్యకు గురైనాడు.

కాంతరాజ్ మద్యంకు బానిస అయ్యాడు. ఇతని కుమారుడు అభిషేక్ ఓ ప్రైవేట్ స్కూల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కాంతరాజ్ ప్రతి రోజు ఇంటిలో డబ్బు తీసుకెళ్లి మద్యం సేవించి వచ్చి కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

Son Killed his Father in Bangaluru

పద్దతి మార్చుకోవాలని అభిషేక్ తన తండ్రికి చెప్పాడు. అయితే కాంతరాజ్ లో మాత్రం మార్పు రాలేదని తెలిసింది. సోమవారం రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన కాంతరాజ్ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకున్నాడు.
ఆ సమయంలో గొడవ పెద్దది అయ్యింది.

సహనం కోల్పోయిన అభిషేక్ తన స్నేహితుడు రేవణ్ణను పిలిపించాడు. తరువాత స్నేహితుడు రేవణ్ణతో కలిసి అభిషేక్ కన్న తండ్రి మీద కర్రలతో దాడి చేసి చంపేశారు. మృతదేహం తీసుకెళ్లి నిర్జనప్రదేశంలో విసిరేశారు. మంగళవారం విషయం తెలుసుకున్న పోలీసులకు అనుమానం వచ్చి అభిషేక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసింది. అభిషేక్, రేవణ్ణను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka: Son Killed his Father in Bangaluru.
Please Wait while comments are loading...