• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్టార్స్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం - జమ్మూకాశ్మీర్, లదాక్‌కు భారీ ప్యాకేజీ

|

విద్యా రంగంలో కీలక సంస్కరణగా భావిస్తోన్న మరో పథకాన్ని అమలు చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. స్ట్రెంథెనింగ్ టీచింగ్‌-లెర్నింగ్ అండ్ రిజ‌ల్ట్స్ ఫ‌ర్ స్టేట్స్ (STARS) ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో జ‌మ్ముక‌శ్మీర్‌, లదాక్ లకు ప్ర‌త్యేక ప్యాకేజీ, న‌గ‌ర్నార్ స్టీల్ ప్లాంట్ డీమెర్జ‌ర్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

5000 కేజీల బాంబు పేలితే ఎట్టా ఉంటదో తెలుసా? నిర్వీర్యం చేయబోతే చివరికిలా: వైరల్ వీడియో

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు. భారీ అంచ‌నా వ్య‌యంతో కూడిన స్టార్స్‌ ప్రాజెక్టును ప్ర‌పంచ‌బ్యాంకు స‌హ‌కారంతో అమ‌ల్లోకి తీసుకురానున్న‌ట్లు మంత్రి చెప్పారు.

union Cabinet approves education policy’s ‘stars’, packages to JammuKashmir and Ladakh

స్టార్స్ ప్రాజెక్టు పూర్తి అంచ‌నా వ్య‌యం రూ.5,718 కోట్లు కాగా, ప్ర‌పంచ బ్యాంకు 500 మిలియ‌న్ అమెరిన్ డాల‌ర్ల‌ను ఆర్థిక సాయంగా అందించ‌నున్న‌ద‌ని జవదేకర్ తెలిపారు. కేంద్ర స‌ర్కారు స్పాన్స‌ర్ చేస్తున్న ఈ స్టార్స్ ప్రాజెక్టును స్కూల్ ఎడ్యుకేష‌న్ & లిట‌రసీ డిపార్టుమెంట్‌, విద్యాశాఖ ద్వారా అమ‌ల్లోకి తీసుకొస్తార‌ని పేర్కొన్నారు. ముందుగా ఇది హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌, ఒడిశా రాష్ట్రాల్లో అమ‌ల్లోకి రానుంద‌ని తెలిపారు. అలాగే..

జగన్, కేసీఆర్‌కు మోదీ ఫోన్ కాల్ - కేంద్రం సహాయానికి హామీ - రాష్ట్రపతి కోవింద్ కీలక సందేశం

  India-China Stand Off : లడఖ్ ను భారత్ అక్రమంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది - China

  జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద జమ్మూ కాశ్మీర్, లదక్ కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని సైతం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ప్యాకేజీ కింద రెండు యూటీలకు తగిన నిధులు లభిస్తాయని, కేంద్ర ప్రాయోజిత లబ్ధిదారుల పథకాలన్నింటినీ సార్వజనినీకరించాలన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జవదేకర్ చెప్పారు.

  English summary
  The Union Cabinet on Wednesday approved the new ‘Teaching-Learning and Results for States’ (STARS) program under the National Education Policy (NEP). 5718 crore rupees will be spent under the World Bank assisted program. union Minister Prakash Javadekar told. minister also said that the cabinet has also approved a special package of Rs 529 crore under the National Rural Livelihood Campaign ‘Deendayal Antyodaya Yojana for the Union Territories of Jammu and Kashmir and Ladakh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X