Wife: భార్య గర్బవతి, ఆ రోజు నుంచి టార్చర్, సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపేసిన భర్త, రాత్రి ఇంట్లో !
అసోం: పోలీసు ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. అదే సమయంలో ఓ యువతికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇద్దరి కులాలు ఒకటి కావడం, యువతి, యువకుడు ఇష్టపడటంతో వారి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. కానిస్టేబుల్ కు, ఆ యువతికి సాంప్రధాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న తరువాత దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు రాజీలు చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ భార్య గర్బవతి అయ్యింది. రాత్రి డ్యూటీ ముగించుకున్న కానిస్టేబుల్ ఇంటికి వెళ్లాడు. అర్దరాత్రి దంపతుల మద్య మళ్లీ గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కానిస్టేబుల్ అతని సర్వీస్ రివాల్వర్ తీసుకుని గర్బవతి భార్య దారుణంగా కాల్చేశాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గర్బవతిని రక్షించాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయితే కానిస్టేబుల్ భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు అన్నారు, భార్య గర్బవతి అయినప్పటి నుంచి ఆమెను కానిస్టేబుల్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కానిస్టేబుల్ ఉద్యోగం
అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో బికి చెటియా అలియాస్ చెటియా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దిబ్రూగఢ్ లోని సదర్ పోలీస్ స్టేషన్ లో చెటియా కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసు ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు.

నాలుగేళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి
అదే సమయంలో జయశ్రీ చెటియా అనే యువతికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. జయశ్రీ, చెటియా కులాలు ఒకటి కావడం, యువతి, యువకుడు ఇష్టపడటంతో వారి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. కానిస్టేబుల్ చెటియాకు, జయశ్రీలకు సాంప్రధాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న తరువాత చెటియా, జయశ్రీ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు.

భార్య గర్బవతి
చెటియా, జయశ్రీ దంపతులు సదర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అసోం పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు. ఇటీవల జయశ్రీ, చెటియా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు చెటియా, జయశ్రీ దంపతుల మద్య రాజీలు చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ చెటియా భార్య జయశ్రీ గర్బవతి అయ్యింది.

భార్యను రివాల్వర్ తో కాల్చి పారేసిన కానిస్టేబుల్
రాత్రి డ్యూటీ ముగించుకున్న కానిస్టేబుల్ చెటియా ఇంటికి వెళ్లాడు. అర్దరాత్రి చెటియా, జయశ్రీ దంపతుల మద్య మళ్లీ గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కానిస్టేబుల్ చెటియా అతని సర్వీస్ రివాల్వర్ తీసుకుని గర్బవతి అయిన భార్య జయశ్రీని దారుణంగా కాల్చేశాడు.

గర్బవతి అయినప్పటి నుంచి చిత్రహింసలు
బాధితురాలు జయశ్రీని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గర్బవతి జయశ్రీని రక్షించాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయితే కానిస్టేబుల్ చెటియా భార్య జయశ్రీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు అన్నారు, భార్య జయశ్రీ గర్బవతి అయినప్పటి నుంచి ఆమెను కానిస్టేబుల్ చెటియా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మద్యం మత్తులో భార్యను కాల్చేశాడు ?
బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భార్య జయశ్రీని తానే హత్య చేశాయని చెటియా అంగీకరించాడని పోలీసు అధికారులు అంటున్నారు. భార్య జయశ్రీని సర్వీస్ రివాల్వర్ తో కాల్చే సమయంలో కానిస్టేబుల్ చెటియా మద్యం సేవించి ఉన్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications