హార్ముజ్ సంగతి తర్వాత-యుద్దం ముగించేద్దాం..! ట్రంప్ మరో షాక్ ..!
ఇరాన్‌ను తక్కువ అంచనా వేసి ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికాకు దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ను పూర్తిగా తక్కువ అంచనా వేసిన డొనాల్డ్ ట్రంప్ (donald trump)కు ఇప్పుడు అదే కీలకంగా మారి ప్రపంచ చమురు మార్కెట్లపై ఒత్తిడి పెంచేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అలాగని ఇరాన్ పై భూతల దాడులకు దిగితే హార్ముజ్ ను పూర్తిగా మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో ట్రంప్ రూటుమారుస్తున్నారు.
హార్ముజ్ పై ట్రంప్ హెచ్చరికలు (donald trump)
హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఖర్గ్ ద్వీపంతో పాటు ఇరాన్ లోని విద్యుత్ మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేసి సర్వనాశనం చేస్తానని నిన్న ప్రకటించిన ట్రంప్.. తన సన్నిహితులకు మాత్రం మరో వెర్షన్ చెప్పారు. హార్ముజ్ జలసంధి తెరిపించాలని పట్టుబడితే మొత్తం ఇరాన్ వార్ లో తమ పరిస్ధితి తలకిందులు అయ్యేలా ఉందని, అందుకే దాంతో సంబంధం లేకుండానే వచ్చే వారం ఈ యుద్దం ముగించే విషయం ఆలోచిస్తున్నట్లు ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

రూటు మార్చిన ట్రంప్
హార్ముజ్ జలమార్గాన్ని పూర్తిగా తిరిగి తెరవడానికి చేపట్టే సంక్లిష్టమైన ఆపరేషన్, ట్రంప్ కోరుకుంటున్న ఆరు వారాల కాలపరిమితిని మించి యుద్దాన్ని పొడిగించగలదని ట్రంప్, ఆయన సహాయకులు అంచనా వేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. కాబట్టి శత్రుత్వాన్ని తగ్గించి, దౌత్యంపై మరింత ఎక్కువగా ఆధారపడటానికి ముందు, ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం, దాని క్షిపణి నిల్వలను తగ్గించడం, దాని రక్షణ పరిశ్రమ, అణు సామర్థ్యాలను పరిమితం చేయడం వంటి తన ప్రధాన సైనిక లక్ష్యాలను సాధించడంపై ట్రంప్ ఫోకస్ పెట్టారు.

హార్ముజ్ తో సంబంధం లేకుండానే
మరోవైపు ప్రస్తుత దశ సైనిక లక్ష్యాలు వారాల్లో పూర్తి కావచ్చని, ఆ తర్వాత జలసంధిని తిరిగి తెరవాలా లేదా దేశాల కూటమి నౌకాయాన స్వేచ్ఛను కల్పించాలా అనేది ఇరాన్ నిర్ణయించుకోవాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తేల్చేశారు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం బహుశా మనం ఖర్గ్ ద్వీపాన్ని తీసుకోవచ్చు, లేదా తీసుకోకపోవచ్చని ట్రంప్ తాజాగా చెప్పినట్లు తెలిపింది. అయితే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయలేకపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టెహ్రాన్ పరిమిత ఎగుమతులను కొనసాగించడానికి మార్గాలను కనుగొనవచ్చని తెలుస్తోంది.
-
అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ బౌంటీ..! -
ట్రంప్ దెబ్బకు తలవంచిన ఇరాన్..? ఎట్టకేలకు కాళ్లబేరానికి..? -
Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..! -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
ఇరాన్ వార్ లోకి రెండు గల్ఫ్ దేశాలు? ట్రంప్ వైఫల్యం వేళ బిగ్ ట్విస్ట్..! -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్‌మైండ్ హతం! -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!
















Click it and Unblock the Notifications