andhra pradesh high court kurnool central minister ravi shankar prasad ys jagan rajya sabha హైకోర్టు కర్నూలు కేంద్ర మంత్రి వైయస్ జగన్ రాజ్యసభ
కర్నూలుకు ఏపీ హైకోర్టు తరలింపు : జగన్ ప్రతిపాదన ఇది .. బీజేపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటన తర్వాత, ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోకి చేరింది. ఇక ఏపీ హైకోర్టు తరలింపు అంశంపై ఈరోజు రాజ్యసభలో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిజెపి ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం జగన్ రెడ్డికి ఇష్టం లేదు..అందుకే బెదిరింపులు: చంద్రబాబు ఫైర్

హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 ఫిబ్రవరి నెలలో హైకోర్టు తరలింపుకు ఏపీ సీఎం జగన్ ప్రతిపాదనలు పంపారని మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. హైకోర్టుతో పాటు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. బిజెపి ఎంపీ సంధించిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉన్నత న్యాయస్థానం తరలింపుపై హైకోర్టు , రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం, హైకోర్టు రెండు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందన్న కేంద్ర మంత్రి
హైకోర్టు నిర్వహణ ఖర్చు, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు.
హైకోర్టు పరిపాలనా బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేసిన మంత్రి రవిశంకర్ ప్రసాద్ అమరావతి నుండి కర్నూలుకు హైకోర్టు తరలించడం విషయంలో ఏపీ ప్రభుత్వం, హైకోర్టు రెండు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని, హైకోర్టు తరలింపుకు సంబంధించిన గడువు ఏదీ లేదని, తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు.

ఏపీలో మూడు రాజదానులపై గతంలోనే క్లారిటీ ఇచ్చిన కేంద్రం .. ఇప్పుడు ఏపీ హైకోర్టుపై క్లారిటీ
రాష్ట్రంలో మూడు రాజధానులను తెరమీదకు తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తూనే ఉంది. అయితే మూడు రాజధానులు ఏర్పాటు వ్యవహారం అనేక పిటిషన్లు దాఖలైన కారణంగా న్యాయస్థానాల పరిధిలో ఉంది . న్యాయస్థానాలు ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూడు రాజధానులు ఏర్పాటు జరగనుంది. ఇక ఇందుకు సంబంధించి కేంద్రం రాజధానులు ఏర్పాటు రాష్ట్రం పరిధిలోనిదని ఎప్పుడో తేల్చిచెప్పింది. తాజాగా మరోమారు ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారంలో స్పష్టం చేసింది.