వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలస్యంగా తెరుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లు!ఆకలితో అలమటిస్తున్న కోవిడ్ బాదితులు.!డిప్యూటీ మేయర్ తనిఖీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కోవిడ్ బాదితుల కోసం నగరపాలక సంస్థ అందజేస్తున్న ఉచిత భోజనంపై విమర్శలు వెలుగుచూస్తున్నాయి. అంతా బాగానే ఉందిగాని సమయానికి క్యాంటీన్లు తెరవకపోతుండడంతో కరోనా పేషెంట్లు, వారి బంధువులు ఆకలితో అలమటించే పరిస్థితులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం నిలోఫర్ ఆస్పత్రిని డిప్యూటీ మేయర్ సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రోగుల బంధువులు ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసి అన్నపూర్ణ భోజనం సమయానికి తెరవకపోవడం వల్ల రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో మోతే శ్రీలత శోభన్ రెడ్డి వెంటనే ఆవరణలో ఉన్న అన్నపూర్ణ భోజనంని తనిఖీ చేసి పుడ్ క్వాలిటీ గురించి అడిగి తెలుసుకొని, సమయానికి భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటీన్లో భోజనం చేసి ఫూడ్ క్వాటిటీని చెక్ చేసారు జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి.

Annapurna canteens opening late!Covid victims starving.!Deputy Mayor checks

అలానే నిజాం కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందితో కలిసి డిప్యూటీ మేయర్ రోడ్డుపైనే భోజనం చేసి అక్కడ ఉన్నవారిని అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. నిలోఫర్ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని ఆ దిశగా డాక్టర్స్ వైద్య సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ భోజనం తక్కువ చేసి చూడవద్దని, నాణ్యత అంశంలో రాజీపడకుండా, రుచికరమైన అన్నం పప్పు భోజనం అందిస్తున్నామని తెలిపారు.

వాస్తవం చెప్పాలంటే అన్నపూర్ణ భోజనంతో పేదవాడికి కడుపు నిండా అన్నం పెడుతూ వారి ఆకలిని తీరుస్తాన్నామని తెలిపారు. నాణ్యతతో కూడిన భోజనం అందించడం వల్లనే అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీద వెళ్తున్న వారు అన్నపూర్ణ భోజనం కేంద్రానికి వెళ్లి ఆకలి తీరుసుకుంటున్నారని తెలిపారు. తానే స్వయంగా భోజనం చేశానని ఇంత మంచి భోజనం బయట ఏ హోటల్ కి వెళ్ళినా వంద రూపాయల పైనే ఉంటుందన్నారు. పేదవారు ఆకలితో అలమటించకూండదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత భోజన కర్యక్రమం కొనసాగిస్తుందని శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు.

English summary
Criticisms have been leveled at the free meals provided by the municipality for Kovid victims. With the canteens not opening on time, it seems that corona patients and their relatives are starving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X